Begin typing your search above and press return to search.
పురంధేశ్వరి కుమారుడు వైసీపీలోకి?
By: Tupaki Desk | 12 Aug 2018 6:17 AM GMTబీజేపీ నేత - కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తనయుడు హితేశ్ చెంచురాం వచచే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎన్నికల బరిలో దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. పురందేశ్వరి భర్త దగ్గుబాటి వేంకటేశ్వరరావు ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అది. 1989లో ఆయన టిడిపి తరఫున గెలుపొందారు. తర్వాత 2004 - 2009లలో ఆయన కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2014 ఎన్నికల నాటికి విభజన కారణంగా కాంగ్రెస్ నేతలంతా ఎన్నికలకు దూరమైనట్లే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా గెలుపుపై అనుమానంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఆ ఎన్నికల్లో పరుచూరు టీడీపీ పరమైంది. టీడీపీకి చెందిన ఏలూరి సాంబశివరావు అక్కడి నుంచి గెలిచారు.
ప్రస్తుతం పురంధేశ్వరి బీజేపీలో ఉన్నా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేయడం వల్ల ప్రయోజనం లేదని ఆమె కూడా భావిస్తున్నారని టాక్. ఎన్నికలతో సంబంధం లేకుండా రాజ్యసభకు వెళ్లాలనకున్నా పార్టీ ఆమెను లెక్కలోకి తీసుకోలేదు. 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తే గెలుస్తారన్న గ్యారంటీ లేదు. ముఖ్యంగా ఆమెకొక నియోజకవర్గం అంటూ లేదు. తన పరిస్థితే అంతంత మాత్రంగా ఉన్నపుడు కుమారుడు హితేష్ ను కూడా బిజెపి నుంచి పోటీ చేయించడం సాహసం అవుతుంది. అందుకే ఆమె కుమారుడిని వైసీపీలోకి పంపించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అయితే, హితేష్ ని మాత్రమే వైసిపిలోకిపంపాలా లేక తాను కూడా వెళ్లాలా అనే డైలమాలో ఆమె ఉన్నారని అనుచరులు చెబుతున్నారు. విజయవాడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేయడానికి అవకాశం దొరికితే తాను కూడా పార్టీ మారే అవకాశంముందని సమాచారం.