Begin typing your search above and press return to search.

జైలు నుంచి ఆసుప‌త్రిలో చేరిన హ‌ర్ష‌కుమార్!

By:  Tupaki Desk   |   28 Dec 2019 12:00 PM IST
జైలు నుంచి ఆసుప‌త్రిలో చేరిన హ‌ర్ష‌కుమార్!
X
కాంగ్రెస్ మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్.. ఇటీవ‌లి ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న హ‌ల్చ‌ల్ చేశారు. చంద్ర‌బాబు నాయుడు కాళ్ల మీద కూడా ప‌డి హ‌ర్ష‌కుమార్ విమ‌ర్శ‌ల పాల‌య్యారు. అలా చంద్ర‌బాబు నాయుడు పాదాల‌ను తాకినా హ‌ర్ష‌కుమార్ కు ఎంపీ టికెట్ అయితే ల‌భించ‌లేదు. చంద్ర‌బాబు నాయుడు అజెండాకు అనుగుణంగా జ‌గ‌న్ మీద కూడా ఇష్టానుసారం మాట్లాడారు హ‌ర్ష‌కుమార్. అంత చేసినా చంద్ర‌బాబు నాయుడు మాత్రం అమ‌లాపురం ఎంపీ టికెట్ ను హ‌ర్ష‌కుమార్ కు కేటాయించ‌లేదు.

ఇక తెలుగుదేశం పార్టీలో టికెట్ ల‌భించ‌ద‌నే క్లారిటీ వ‌చ్చాకా.. ఆ పార్టీకి కూడా దూరం అయ్యారు హ‌ర్ష‌కుమార్. టీడీపీలోకి అలా చేరి, అలా బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ సంగ‌త‌లా ఉంటే.. కొన్ని వ్య‌వ‌హారాల్లో దురుసుగా ప్ర‌వ‌ర్తించి హ‌ర్ష‌కుమార్ కేసుల‌ను ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి ఒక కేసులో ఆయ‌న అరెస్ట్ అయ్యారు. పోలిస్ రిమాండ్ లో ఉన్నారు.

విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న న్యాయ‌మూర్తుల‌ను, ప్ర‌భుత్వోద్యుగుల‌ను బెదిరించిన కేసులో హ‌ర్ష‌కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌న‌కు కోర్టు రిమాండ్ విధంచ గా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. 16 రోజులుగా ఆయ‌న రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో హ‌ర్ష‌కుమార్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ట‌. తీవ్ర‌మైన క‌డుపుతో బాధ‌ప‌డుతూ ఉండ‌టంతో ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్టుగా స‌మాచారం. ఒక స‌మ‌యంలో తీవ్ర‌మైన వ్యాఖ్య‌ల‌తో, దురుసు వ్య‌వ‌హ‌ర‌ణ తీరుతో వార్త‌ల్లో నిలిచిన హ‌ర్ష‌కుమార్ ప‌రిస్థితి ఇప్పుడిలా ఉంది.