Begin typing your search above and press return to search.

పోర్న్ స్టార్ ఫోటో పోస్ట్ చేసి అడ్డంగా బుక్ అయ్యారు!

By:  Tupaki Desk   |   3 Sept 2019 1:45 PM IST
పోర్న్ స్టార్ ఫోటో పోస్ట్ చేసి అడ్డంగా బుక్ అయ్యారు!
X
అందుకే అంటారా? మనసులో కుళ్లు పెట్టుకుంటే ఏదో రకంగా ఇబ్బందులు తప్పవని. పాక్ కు చెందిన నేతలంతా తమ విపరీతమైన చేష్టలతో అడ్డంగా బుక్ కావటమే కాదు.. అంతర్జాతీయంగా వారి కుటిల ప్రయత్నాలతో వారంతా నవ్వులపాలవుతున్నారు. పుల్వామా ఉగ్రదాడి మొదలుకొని ఇటీవల కశ్మీర్ అంశంపై భారత్ తీసుకున్న నిర్ణయాలతో ఉడికిపోతున్న పాక్.. ఏదోలా తాము సుద్దపూసలమన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలన్న తహతహ ఎక్కువైంది.

అంతర్జాతీయంగా భారత్ ను బద్నాం చేసేందుకు ఏ అవకాశం దొరుకుతుందా? అని వెతుకుతున్న వారు.. తప్పులో కాలేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా పాకిస్తాన్ కు చెందిన పెద్ద మనిషి ఒకరు అడ్డంగా బుక్ అయ్యారు. పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బసిత్ తాజాగా ఒక ట్వీట్ చేశారు.

కశ్మీర్ లో ఎంత అరాచకమో చూడాలంటూ ఆయనో ఫోటో పోస్ట్ చేశారు. అనంతనాగ్ లో యూసఫ్ అనే వ్యక్తి బుల్లెట్ గాయాలతో కంటి చూపు కోల్పోయారని.. అతని కుటుంబ సభ్యుల వేదన చూడాలంటూ పేర్కొన్నారు. అక్కడితో ఆగని ఆయన.. ఇప్పటికైనా నోరు విప్పండి.. అన్యాయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలని ఆవేశ వ్యాఖ్యలు చేశారు.

అయితే.. బసిత్ పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్నది బాధిత మహిళది కాదు.. పోర్న్ స్టార్ జానీ సిన్స్ ది కావటం.. ఆ విషయాన్ని గుర్తించిన పాక్ జర్నలిస్ట్ నైనా ినాయత్ వెంటనే ఆ విషయాన్ని అలెర్ట్ చేశారు. అబద్ధపు ప్రచారం అంటే ఇదే కావొచ్చన్న మాటలతో మాజీ హైకమిషనర్ మాటలు నవ్వుల పాలయ్యేలా చేయటమే కాదు.. పాక్ కుయుక్తి మరోసారి ప్రపంచానికి తెలిసి వచ్చేలా చేసింది.