Begin typing your search above and press return to search.
ప్రధాని మోదీ ఆస్తుల గురించి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 23 Sep 2022 3:47 AM GMTపాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తులకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. పాకిస్థాన్ ఒకప్పటి ప్రధాని, పాకిస్థాన్ ముస్లింలీగ్ అధినేత నవాజ్ షరీఫ్ విదేశాల్లో బిలియన్ డాలర్ల విలువ చేసే అక్రమాస్తులు కూడబెట్టారని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు చేశారు. ఓ దేశ ప్రధాని విదేశాల్లో పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టడం ఒక్క నవాజ్ షరీఫ్‌కే సాధ్యమైందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఆయన విదేశాల్లో ఎంత కూడబెట్టారో ఎవరి ఊహకు కూడా అందదన్నారు. ఈ మేరకు పాకిస్థాన్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గురించి కూడా ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీకి విదేశాల్లో ఉన్న ఆస్తుల గురించి ఎవరికయినా తెలుసా.. ఎవరైనా అసలు ఆ ప్రస్తావన తెస్తారా అని ఇమ్రాన్ ప్రశ్నించారు. మోడీ అవినీతికి దూరమని కొనియాడారు. నవాజ్ షరీఫ్ మాత్రం అవినీతిలో మునిగి తేలారని ఇమ్రాన్ మండిపడ్డారు. దేశం వెలుపల వందల కోట్ల డాలర్ల ఆస్తులున్న వారిలో ఏ దేశ ప్రధాని లేరని.. నవాజ్ షరీఫ్ మాత్రం ఉన్నారన్నారు.
ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. శత్రు దేశానికి చెందిన ప్రధానిని పొగడుతూ స్వదేశానికి చెందిన మాజీ ప్రధానిపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లింలీగ్ పార్టీ అంటోంది.
కాగా నిఖార్సయిన ఆల్‌రౌండర్‌గా క్రికెట్‌లో అడుగుపెట్టిన ఇమ్రాన్ ఖాన్ 1992లో పాకిస్థాన్‌లో తొలి వన్డే ప్రపంచకప్‌ను సాధించిపెట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు పాకిస్థాన్ కప్ కొట్టలేకపోయింది. క్రికెట్ నుంచిరిటైర్ అయ్యాక తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఎంపికై రికార్డు సృష్టించారు.
ఇమ్రాన్ గత కొంత కాలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ వస్తున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే భారత్ రష్యా వద్ద తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసి రాజకీయ చతురత చూపిందని కొనియాడారు. భారత్‌లో ఉన్నట్టు పాకిస్థాన్‌లో విదేశాంగ విధానం స్వేచ్ఛగా లేదని ఇమ్రాన్‌ఖాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది ఆగస్టులో పాక్ నేషనల్ అసెంబ్లీలో మెజార్టీ లేక పాక్ ప్రధాని పదవిని ఇమ్రాన్ ఖాన్ పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా పాక్ నాయకత్వాన్ని, విధానాలను విమర్శిస్తూ వస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ భారత్‌తోనూ, భారత నాయకత్వంతోనూ పాక్‌ను పోలుస్తున్నారు.
కాగా. పాకిస్థాన్‌లో ప్రస్తుతం షెబాజ్ షరీఫ్ (మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు) ప్రధానిగా కొనసాగుతున్నారు. పాకిస్థాన్ ముస్లింలీగ్ నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో పాటు ఇతర పార్టీల సంకీర్ణ ప్రభుత్వం పాకిస్థాన్‌లో అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.
కాగా మరోవైపు ప్రధానమంత్రి కార్యాలయం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వివరాల ప్రకారం.. ప్రధాని మోడీ ఆస్తుల విలువ 2022 మార్చి 31 నాటికి రూ.2,23,82,504 గా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.