Begin typing your search above and press return to search.

బాలకృష్ణను కాదని వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   10 March 2020 8:31 AM GMT
బాలకృష్ణను కాదని వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే
X
హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడి గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు త్వరలోనే తెలుగుదేశం పార్టీని వీడి అధికార పార్టీ వైఎస్సార్సీపీ లో చేరనున్నట్లు సమాచారం. దీనికి తన గురువుగా భావించే బాలకృష్ణ అనుమతి తీసుకుని మరి జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారంట. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పని చేశారు.టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన బాబూరావు.. బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవలందించిన ఆయన ప్రస్తుత అధికార పార్టీ అయిన వైసీపీలో కి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమచారం. ఇప్పటికే తన అనుచరులతో మంతనాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

2004, 2014 ఎన్నికల్లో కనిగిరి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో టీడీపీ టికెట్ లభించినా చివరి నిమిషంలో నామినేషన్ లో తప్పిదాల తో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో కనిగిరి స్థానం ఆశించగా పార్టీ అధినేత చంద్రబాబు దర్శి టికెట్ ఇవ్వడం తో పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఓడిపోవడం తో ఖంగుతిన్నారు. అది బాలకృష్ణ చెప్పడంతోనే దర్శి నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడంతోనే వైఎస్సార్సీపీలో చేరాలని భావించారు.

అయితే బాలకృష్ణ టీడీపీలోనే ఉండమని చెప్పడంతో కదిరి బాబూరావు ఇన్నాళ్లు ఆ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రావడం తో ఇదే సమయమని, అధికార పార్టీలో చేరేందుకు బాబురావు సిద్ధమయ్యాడు. బాలకృష్ణ అంగీకరించకపోయినా ఆయనను బలవంతంగా ఒప్పించేసి వైఎస్సార్సీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ మేరకు అధికార పార్టీ పెద్దల తో టచ్ లో ఉన్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి ముఖ్యులతో మంతనాలు సాగించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో వైఎస్సార్సీలో చేరి బలం చూపిస్తే భవిష్యత్ లో గుర్తింపు ఉంటుందని భావిస్తున్నారు. ఇది సరైన సమయంగా బాబూరావు భావించి తన మద్దతుదారులు, అనుచరుల తో కలిసి వైఎస్సార్సీపీ లో చేరనున్నారు. ప్రధాన కాపు వర్గానికి చెందడంతో బాబారావును పార్టీలో చేర్చుకునేందుకు జగన్ అంగీకరించినట్లు తెలుస్తోంది.