Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు మాజీ ఎంపీ సెటైరిక్ సూచన
By: Tupaki Desk | 13 July 2016 5:30 PM GMT చంద్రబాబు విదేశీ పర్యటనలు.. అమరావతి నిర్మాణంలో విదేశీ సంస్థల భాగస్వామ్యం నేపథ్యంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీ - సాహిత్యాభిమాని డీవీజీ శంకరరావు ఆసక్తికర రచన చేశారు. చిన్నపాటి సంభాషణలా అల్లిన ఈ రచన ఎంతో సూచనాత్మకంగా ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది షేర్ అవుతోంది..
రష్యా పర్యటనలో ఉన్న చంద్రబాబుకు ఏపీ నుంచి ఒక ఆడపడుచు - ఆమె కుమారుడు ఫోన్ చేసి మాట్లాడినట్లుగా ఉన్న ఈ రచన ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరిస్తూనే సూచనాత్మకంగానూ ఉంది. ‘‘నమస్తే చంద్రన్నా... ఆంధ్రా నుంచి ఆడపడుచుని మాట్లాడుతున్నా. ఒకసారి మా బుడతడు మాట్లాడుతాడు వినండి..’’ అంటూ తన కుమారుడికి ఫోన్ ఇస్తుంది.. వాడు వెంటనే ‘‘సింగపూర్ - స్విట్జర్లాండ్ - థాయిలాండ్ - అమెరికా - చైనా - జపాన్ - కజికిస్థాన్ - రష్యా’ అంటూ వరుసగా దేశాల పేర్లన్నీ చదివేస్తాడు. వెంటనే వాళ్లమ్మ మళ్లీ ఫోన్ అందుకుని.. తాను మాట్లాడడం మొదలుపెడుతుంది.
‘‘అన్నా.. ఇదంతా మీ చలవే.. మీ పుణ్యమా అని - మీరెన్ని దేశాలు తిరిగితే అన్ని దేశాల పేర్లు మావాడికి తెలిశాయి. మా ఆయనకైతే నాలుగు దేశాల పేర్లు కూడా తెలిసేవి కాదు. అయినా.. ఇంకా ఎన్ని దేశాలు తిరుగుతావన్నా’’
‘‘అమరావతిని విశ్వనగరాన్ని చేయడానికి గాను విశ్వమంతా తిరుగుతా’’ చంద్రబాబు సమాధానం
ఆ వెంటనే ఆమె.. ‘‘వంటగాళ్లు ఎక్కువైతే వంట చెడిపోతుందన్నా’’
‘‘నలుగురు చేయేస్తే మంచిదేగా’’ చంద్రబాబు సమాధానం
‘‘చేయేస్తే పరవాలేదన్నా.. అందరూ మన నెత్తిన చెయ్యి పెడతారేమోనని భయం’’
అలా ఏం జరగదులే..
అయినా.. ఒక్క అమరావతి పనులు అంతమందికి ఎలా సర్దుతావన్నా...
‘‘ఆ.. ఏముంది - ఒకరు గోడ కడితే - ఒకరు శ్లాబు వేస్తారు’’ చంద్రబాబు సమాధానం
‘‘అమరావతి మాట ఎలా ఉన్నా కానీ.. 125 అడుగుల ఎన్టీఆర్ - అంబేద్కర్ విగ్రహాలు పెడతానంటున్నావు కదా.. అవి మాత్రం చైనా వాళ్లకు - జపాన్ వాళ్లకు ఇవ్వొద్దన్నా.. వాళ్లు చైనా - జపాన్ ముఖాలతో ఆ విగ్రహాలను చేస్తే ఆ మహానుభావులను చూడలేం’’ అంటూ ఫోన్ పెట్టేస్తుంది.
‘‘అబ్బబ్బా.. అమెరికావాడితోనైనా వాదించగలను కానీ.. ఈ ఆడపడుచులతో మాత్రం వాదించలేను’’ అనుకుంటారు చంద్రబాబు.
...ఇలా సెటైరిగ్గా రాసిన ఆ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ నుంచి గతంలో ఎంపీగా పనిచేసి డాక్టర్ డీవీజీ చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు అంటే అభిమానం చూపే ఆయన ఇలా సూచనాత్మకంగా తన మనసులోని మాటను వెల్లడించినట్లుగా ఉంది.