Begin typing your search above and press return to search.

12 వేల మందితో డేష్‌ డేష్‌.. అయినా ఎయిడ్స్‌ రాలే..!!

By:  Tupaki Desk   |   9 April 2015 4:52 PM GMT
12 వేల మందితో డేష్‌ డేష్‌..  అయినా ఎయిడ్స్‌ రాలే..!!
X
ఫిలిప్పీన్సులోని ఓ పాఠశాల ప్రిన్సిపాల్‌ తాను చేసిన వెధవ పనికి కటకటాల పాలయ్యాడు. అతడు ఏకంగా 12వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గన్నాడట. వాళ్ళందరికి డబ్బులిచ్చి వారితో శృంగారం చేశాడట. ఇటీవలే మనీలాకు చెందిన ఓ 14 ఏళ్ల అమ్మాయితో సెక్సు చేస్తూ దొరికిపోయాడు. దీంతో అతడ్ని జపాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఫిలిప్పీన్స్‌లో ప్రిన్సిపాల్‌గా పని చేసిన యుహీ తకషిమీ ఏకంగా 12వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గన్నాడు. అతని వయస్సు 64ఏళ్లు... గత 27 ఏళ్లుగా ఆయనకు ఇదే పని.. మహిళలకు మాయమాటలు చెప్పడం.. లోబరుచుకుని సెక్సు చేయడం. అంతేకాదు... కల్లబల్లి మాటలు చెప్పి లక్షా 50వేల మంది మహిళలతో ఫొటోలు దిగాడు. అంతేగాక, సేకరించిన మహిళల ఫొటోలతో 400 ఆల్బమ్స్‌ కూడా తయారు చేసి ఇంట్లో దాచుకున్నాడు. తన తీపి జ్ఞాపకాలకు గుర్తుగానే ఫొటోలను భద్రపరిచినట్లు పోలీసులకు వెల్లడించాడు. 1988 నుంచి డబ్బులు చెల్లిస్తూ మహిళలతో శృంగారం జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దాదాపు 14 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు వయసున్న 12 వేల మందితో ఇంతవరకు సెక్సు చేసినట్లు ఈయన విచారణలో పోలీసులకు చెప్పాడు. అంతేకాదు... తేదీలు సహా దీనికి సంబంధించిన రికార్డు ఈయన వద్ద ఉంది. ఇలాంటి విశృంఖలత మానసిక రోగం తప్ప ఇంకేమీ కాదని డాక్టర్లు అంటున్నారు. కాగా.... 12 వేల మందితో సెక్సు చేసిన తకషిమీకి కచ్చితంగా ఎయిడ్స్‌ వచ్చే ఉంటుందని అంటున్నారు.. రాకపోతే మాత్రం వైద్యులు ఆయనపై పరిశోధనలు చేస్తే ఎయిడ్స్‌ రాకుండా నిరోధించడానికి పనికొచ్చే రోగనిర్దారక శక్తికి సంబంధించి కొత్త విషయాలేమైనా వెలుగుచూసే అవకాశముంది.