Begin typing your search above and press return to search.

60ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న మాజీ కేంద్రమంత్రి!

By:  Tupaki Desk   |   10 March 2020 4:08 AM GMT
60ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న మాజీ కేంద్రమంత్రి!
X
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మహారాష్ట్రకు చెందిన ముకుల్ వాస్నిక్ కేంద్ర మాజీ మంత్రి ముకుల్ వాస్నిక్ 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. తన స్నేహితురాలు అయిన రవీనా ఖురానాను సోమవారం వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ పెళ్లి వేడుకకి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ సీనియర్ నేత, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, మరికొందరు ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు.

మహారాష్ట్రకు చెందిన ఒకప్పటి సీనియర్ నేత బాలకృష్ణ కుమారుడే ఈ ముకుల్ వాస్నిక్. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరిగా పార్టీలో అగ్రస్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినప్పుడు కొత్త అధ్యక్షుడుగా ముకుల్ వాస్నిక్ పేరు గట్టిగా వినిపించింది.

ఇకపోతే ఈ 60 ఏళ్ల మాజీ కేంద్రమంత్రి ... ముకుల్ వాస్నిక్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. బ్రహ్మచారి జీవితాన్నే ఇప్పటివరకు గడిపాడు. గత కోనేళ్ళుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు అకస్మాత్తుగా , తన స్నేహితురాలిని పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాగా, ఈ పెళ్లి పై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ పెళ్లి కాంగ్రెస్ పార్టీ కీలక నేత మనీష్ తివారీ స్పందిస్తూ ..ముకుల్ వాస్నిక్, రవీనాలను 1984-85 సమయంలో తొలిసారి కలిశాను. అప్పట్లో మేమంతా కలిసి రష్యాలోని మాస్కోలో జరిగిన వరల్డ్ యూత్, స్టూడెంట్ ఫెస్టివల్ కు హాజరయ్యాం. వారిద్దరికీ నా శుభాకాంక్షలు” అని తెలిపాడు. అలాగే రాజస్థాన్‌ సీఎం కూడా ఈ కొత్త దంపతులకి తన విషెష్ తెలియజేసారు.