Begin typing your search above and press return to search.

నా మాజీ మొగుడే...మీ కాబోయే ప్ర‌ధాని

By:  Tupaki Desk   |   26 July 2018 12:31 PM GMT
నా మాజీ మొగుడే...మీ కాబోయే ప్ర‌ధాని
X
పాకిస్థాన్‌ లో ఇమ్రాన్‌ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీకి 113 సీట్లు వచ్చాయి. అయితే ఇమ్రాన్‌ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే స్వతంత్ర అభ్యర్థుల సాయం అవసరం. అయితే ఇలా ఓ వైపు ప్ర‌భుత్వం ఏర్పాటు ప్ర‌య‌త్నం ఇంకా సాగుతుండ‌గానే... ఇమ్రాన్ మాజీ భార్య జెమీమా ఖాన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఫలితాలను ఇంకా అధికారికంగా ప్రకటించకముందే.. ఇమ్రాన్‌ఖాన్‌కు అభినందనలు చెబుతూ ట్వీట్ చేసింది. త‌న మాజీ భ‌ర్త కాబోయే ప్ర‌దాని అని అన్నారు. అంతేకాకుండా త‌న పిల్ల‌ల మాజీ తండ్రి క‌ల నెరేరింద‌ని పేర్కొంది.

1995లో జెమీమా - ఇమ్రాన్ పెళ్లి చేసుకున్నారు. 2005లో విడిపోయారు. ఆ తర్వాత జెమీమా లాహోర్ నుంచి లండన్ వెళ్లిపోయింది. అయినా ఇద్దరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఇమ్రాన్‌ ఖాన్‌ కు ఇద్దరు తనయులు. ఒకరు సూలియామన్ ఇసా ఖాన్ - మరొకరు ఖాసీ ఖాన్. పాకిస్థాన్‌ లో ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచీ వీళ్లు ఎన్నికలపై చాలా ఆసక్తి చూపారు. మీరు కోరుకున్న లీడర్ మీకు రావాలి.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ బుధవారం ఓటింగ్ మొదలయ్యే ముందు కూడా జెమీమా ఓ ట్వీట్ చేసింది. తాజాగా ఫ‌లితాల‌పై ఆమె స్పందిస్తూ `` 22 ఏళ్లుగా ఎన్నో అవమానాలు - అడ్డంకులు - త్యాగాలు చేసిన తర్వాత నా తనయుల తండ్రి పాకిస్థాన్‌ కు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించని మనస్తత్వానికి ఈ విజయం నిదర్శనం. ఇక ఇప్పుడు తాను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానో తెలుసుకోవడమే ఆయన ముందున్న అతిపెద్ద సవాలు`` అని జెమీమా ట్వీట్ చేసింది.

ఇదిలాఉండ‌గా...కాంగ్రెస్ సీనియర్ నేత - ఎంపీ శశిథరూర్ సైతం పాక్ ఫ‌లితాల‌పై స్పందించారు. ఊహించినట్టుగానే పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలు వచ్చాయని అన్నారు. పాక్‌ లో ఏ ప్రభుత్వం ఏర్పడినా - వాళ్లు మిలిటరీ ఆదేశాలను జవదాటరు - కాబట్టి పాక్‌ లో ఇమ్రాన్ రాకతో మార్పు జరుగుతుందని ఆశించడం లేదని థరూర్ అభిప్రాయపడ్డారు. పాక్‌లో మార్పు కావాలని ఆ దేశ మిలిటరీ గత ఏడాది కాలం నుంచి ఆశిస్తోందని, నవాజ్ షరీఫ్‌ను ఓడించాలన్న ఉద్దేశంతోనే ఆర్మీ పనిచేసిందని - అందువల్లే ఇమ్రాన్ ఖాన్‌ ను ప్రత్యర్థిగా మిలిటరీ చూసుకున్నదని థరూర్ తెలిపారు. ``ప్రస్తుతం జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీకి 113 సీట్లు వచ్చాయి. అయితే ఇమ్రాన్‌ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే స్వతంత్ర అభ్యర్థుల సాయం అవసరం. స్వతంత్ర విజేతలు మిలిటరీ ఆదేశాలను పాటిస్తారని - దాని ప్రకారమే ఇమ్రాన్ కూడా తన ప్రణాళికలను రచిస్తుంటారు` అని శశి అన్నారు. ఒక రకంగా ప్రస్తుతం ఫలితాలు పాక్ మిలిటరీకి అనుకూలంగా వచ్చాయని అన్నారు.