Begin typing your search above and press return to search.

మోడీకి ధిక్కార నోటీస్

By:  Tupaki Desk   |   23 Nov 2016 5:24 AM GMT
మోడీకి ధిక్కార నోటీస్
X
ప్రధాని మోడీకి మరిన్ని చిక్కులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు తెచ్చిన అలజడితో విమర్శలు ఎదుర్కొంటున్న ఆయనకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. కేజ్రీవాల్ - మమతా బెనర్జీ వంటివారు మోడీపై మండిపడుతూ సంయుక్త ఉద్యమాలకు తెరతీస్తున్న సమయంలోనే ఇంకో ఇబ్బంది వచ్చి పడుతోంది. అసలు పార్లమెంటుతో సంబంధం లేకుండా ప్రధాని ఇలా నోట్లను రద్దు చేయొచ్చా అన్న ధర్మ సందేహం మొదలైంది... ఈ లాజిక్ ఆధారంగానే మోడీ ధిక్కార నోటీసు ఇచ్చేందుకు సీపీఎం రెడీ అవుతోంది.

కాగా సీపీఎం వేస్తున్న స్టెప్ తో మోడీ ఇరుకునపడతారన్న వాదన వినిపిస్తోంది. దీనిపై ఆ పార్టీ న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. పార్లమెంటులో కాకుండా సభ వెలుపల ఇలాంటి ప్రకటన చేయడాన్ని పార్టీ తప్పుపడుతోంది. సభ వెలుపల విధాన నిర్ణయం ప్రకటిస్తే దానిపై తరువాత ఉభయ సభల్లో ప్రధాని ప్రకటన చేయాల్సి ఉంటుందని... కానీ, అలా జరగలేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంటున్నారు. దీనిపై ప్రధాని మోదీకి ధిక్కారణ నోటీసు ఇచ్చే అంశంపై న్యాయకోవిదులతో సంప్రదింపులు జరపనున్నట్టు ఆయన వెల్లడించారు.

దేశమంతటిపై ప్రభావం చూపుతున్న కీలక అంశంపై మోడీ దాటవేత ధోరణి అనుసరిస్తున్నారని... పార్లమెంటులో వివరణ ఇవ్వకుండా మోదీ అహకారపూరితంగా - మొండిగా వ్యవహరిస్తున్నారని ఏచూరి ధ్వజమెత్తారు. కాగా సీపీఎం ఈ విషయంలో తన లాజిక్ కు కట్టుబడి న్యాయపరంగా ముందుకెళ్తే మాత్రం మోడీ వివరణ ఇచ్చుకోకతప్పదని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/