Begin typing your search above and press return to search.
టీడీపీకి కండువాల కరువు వచ్చిందా!
By: Tupaki Desk | 13 Aug 2019 9:20 AM GMTతెలుగుదేశం పార్టీ గురించి చెప్పమంటే ఆ పార్టీ నిర్మాణాత్మకత గురించి చాలా మంది గొప్పగా చెబుతారు. తెలుగుదేశంలో ప్రతీదీ సిస్టమేటిక్ గా ఉంటుందని - పార్టీ ప్రోగ్రామ్స్ - పార్టీ కోసం పని చేసే వాళ్లకు ఎలాంటి లోటు రాకుండా చూస్తారని అంటారు. పార్టీ పదవుల్లో ఉండే వారికి భారీగా జీతభత్యాలు ఇవ్వడం కూడా తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అనే టాక్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు పార్టీని ఒక కార్పొరేట్ సిస్టమ్ తో నడుపుతారని అంటారు.
మరి అంత నేపథ్యం ఉన్న పార్టీ కి సంబంధించి - స్వయంగా అధినేతకే పచ్చకండువా కొరత వచ్చినట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు - అమరావతి వేదికగా జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్ లో ఆ పార్టీ నేతలు కండువాల కోసం కష్టాలు పడినట్టుగా నట్టుగా ఉన్నారు. తమ పార్టీ కండువాలు అందుబాటులో లేకపోవడంతో వారు స్థానికంగా నేతలు తయారు చేయించిన కండువాలను ధరించారు.
మిగతా నేతలు వాటిని ధరించి ఉంటే అదేమంత విడ్డూరం కాదు. అయితే స్వయంగా చంద్రబాబు నాయుడే ఒక నియోజకవర్గం వాళ్ల కండువాను వేసుకోవడం గమనార్హం. చంద్రబాబు నాయుడు మెడలో వేసుకున్న ఆ కండువా పై గుడివాడ నియోజకవర్గం పేరు హైలెట్ అవుతోంది.
అంటే అది గుడివాడ నియోజకవర్గం వాళ్లు కొట్టించిన కండువా అని స్పష్టం అవుతోంది. తెలుగుదేశం పార్టీకి జాతీయాధ్యక్షుడు అయిన చంద్రబాబు నాయుడు అలా ఒక నియోజకవర్గం కండువాను వేసుకున్నారు. ఆ కార్యక్రమం గుడివాడ సెగ్మెంట్లో జరిగినది కూడా కాదు. రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్. అయినా చంద్రబాబు గుడివాడ నియోజకవర్గం కండువాను వేసుకున్నారు.
దీని వెనుక వేరే కథ ఉందని, ఇటీవలి ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ భారీగా ఖర్చు పెట్టారని, భారీ ఎత్తున ప్రింటెడ్ పచ్చకండువాలు కొట్టించారని.. అంత చేసినా ఆయన గెలవలేకపోయారు. కండువాలు కూడా మిగిలిపోయినట్టుగా ఉన్నాయి. వాటిని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించి ఇలా ఉపయోగిస్తున్నారని తెలుగుదేశం వర్గాలే అనుకుంటున్నాయట!