Begin typing your search above and press return to search.
జైలుశిక్షకు కోత పెట్టనున్న ‘‘యోగా’’
By: Tupaki Desk | 3 Dec 2015 4:51 AM GMTజైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు మహారాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలు జైల్లో కానీ యోగా నేర్చుకుంటే ఖైదీలు అనుభవిస్తున్న శిక్షా కాలంలో గరిష్ఠంగా మూడు నెలల వరకూ శిక్ష తగ్గే వీలుంది. తాజాగా ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర సర్కారు తీసుకుంది.
యోగా నేర్చుకొని.. నైపుణ్యం సాధించిన ఖైదీలకు గరిష్ఠంగా మూడు నెలలు జైలుశిక్షలో కోత వేయాలన్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి ఫూణెలోని జైలుకు మాత్రమే పరిమితం చేశారు.
ఇక్కడ ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత.. రాష్ట్రంలోని మిగిలిన జైళ్లకు ఈ నిబంధనను వర్తింపచేస్తారు. జైల్లోయోగా శిక్షణ ఇవ్వటం గతంలోనే ఉన్నప్పటికీ.. జైళ్ల సంస్కరణల్లో భాగంగా యోగాలో నైపుణ్యం సాధించిన వారికి శిక్ష తగ్గించాలన్న నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మరి.. ఈ నిర్ణయాన్ని మిగిలిన రాష్ట్రాలు అనుసరిస్తాయో లేదో చూడాలి. యోగా.. ఖైదీల జైలుశిక్ష తగ్గించటం ఆసక్తికర పరిణామమే సుమా.