Begin typing your search above and press return to search.

పరువునష్టం కేసులు తప్పవా ?

By:  Tupaki Desk   |   24 March 2022 12:30 PM GMT
పరువునష్టం కేసులు తప్పవా ?
X
రెండు అంశాలపై వైసీపీ ఎంఎల్ఏలపై ఒకరు పరువునష్టం కేసులు వేస్తానని బెదిరిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబునాయుడు, టీడీపీ ఎంఎల్ఏలపై పరువునష్టం కేసులు వేస్తానని వైసీపీ ఎంఎల్ఏలు వార్నింగిస్తున్నారు. వీళ్ళ బెదిరింపులు, హెచ్చరికలు చూస్తుంటే ఒకరిపై మరొకరు పరువునష్టం కేసులు దాఖలు చేసుకోవటం, ఎదుర్కోవటం తప్పదనే అనిపిస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు విషయంలో తనపై బురదచల్లుతున్నందుకు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ ఎంఎల్ఏలపై పరువునష్టం కేసులు వేస్తానని బెదిరిస్తున్నారు.

పెగాసస్ సాఫ్ట్ వేర్ పై తనకు ఎలాంటి సంబంధంలేకపోయినా తనును ఇన్వాల్స్ చేస్తున్నట్లు ఏబీ మండిపడ్డారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలుపై తనకు వ్యతిరేకంగా ఎంఎల్ఏల దగ్గర ఏవైనా ఆధారాలుంటే బయటపెట్టాలని సవాలుచేశారు.

ఇదే సమయంలో మద్యం బ్రాండ్లకు సంబంధించి బ్రాండ్ల పేర్ల విషయంలో చంద్రబాబు, టీడీపీ ఎంఎల్ఏలపై పరువు నష్టం కేసు వేయబోతున్నట్లు వైసీపీ ఎంఎల్ఏ సామినేని ఉదయభాను, కోరుముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు.

ఇపుడు ఏ బ్రాండ్లయితే తమ హయాంలో వచ్చాయని చంద్రబాబు, టీడీపీ ఎంఎల్ఏలు పదే పదే ఎగతాళి చేస్తున్నారో ఆ బ్రాండ్లకు అనుమతిచ్చిందే చంద్రబాబు అని వీళ్ళు వివరించారు. తన హయాంలో తానే అనుమతించిన బ్రాండ్లను ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వంపై బురద చల్లేస్తున్నట్లు సామినేని మండిపడ్డారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైసీపీ ఎంఎల్ఏలపై ఏబీ పరువునష్టం కేసులు వేయాలంటే ప్రభుత్వం అనుమతించాలి. కానీ చంద్రబాబు, టీడీపీ ఎంఎల్ఏలపై పరువునష్టం కేసులు వేయాలంటే వైసీపీ ఎంఎల్ఏలకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు విషయంలో నేరుగా అదే పేరుతో రాష్ట్రంలో వాడకపోయుండచ్చు. మరి పరువునష్టం కేసులు వేసుకుంటే ఎవరు తగులుకుంటారో చూడాలి.