Begin typing your search above and press return to search.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవా ?
By: Tupaki Desk | 18 Dec 2021 3:36 AM GMTఅధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. రాజీనామాలకు కేసీయార్ పెట్టింది పేరు. అలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన చరిత్ర కూడా కేసీయార్ కు ఉంది. 2019లో జరగాల్సిన షెడ్యూల్ ఎన్నికలను 6 నెలలు ముందుకు జరిపేసి 2018, డిసెంబర్లోనే నిర్వహించేశారు. ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత వస్తే కష్టమన్న ఆలోచనతోనే కేసీయార్ అప్పట్లో మధ్యంతరం జపం చేశారు.
అప్పటితో పోల్చుకుంటే ఇపుడే ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ కేసీయార్ తో పాటు ఆయన ప్రభుత్వాన్ని ఓ రేంజిలో ఆటాడుకుంటున్నాయి. మొన్నటికిమొన్న
హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ ఉపఎన్నికలో గెలవటానికి కేసీయార్ అన్నీ హద్దులూ దాటిపోయారు. ప్రలోభాలు, ఒత్తిళ్ళు, డబ్బు పంపకాలు, బెదిరింపులు, అభివృద్ధి పనులు ఇలా గెలుపుకోసం ఏ అవకాశాన్ని వదులుకోలేదు.
ఇంత చేసినా చివరకు టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాసయాదవ్ ఓడిపోయారు. అంటే ఏ స్థాయిలో కేసీయార్ పైన జనాల్లో వ్యతిరేకత ఉందో అర్థమైపోతోంది. అప్పటి నుండే మధ్యంతర ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే కేంద్రంపై కేసీయార్ యుద్ధమని ప్రకటించారు. కేంద్రాన్ని ఎంతగా డీ ఫేం చేయాలో అంతా చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఈనెల 19వ తేదీ నుంచి జిల్లాల టూర్లు మొదలు పెడుతున్నారు. నరేంద్ర మోడీ సర్కార్ పై జనాల్లో వ్యతిరేకత తీసుకురావడమే టార్గెట్ గా టూర్లన్న విషయం తెలిసిందే.
తన జిల్లాల టూరును కేసీయార్ వనపర్తితో మొదలుపెడుతున్నారు. తర్వాత జనగామ, నాగర్ కర్నూలు, జగిత్యాల, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా పర్యటిస్తారు. కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు, ఎత్తిపోతల పథకాలకు శంకుస్ధాపన, డబల్ బెడ్రూంల ప్రారంభోత్సవం అని చెబుతున్నా అసలు ఉద్దేశ్యమైతే కేంద్రాన్ని బద్నాం చేయటమే. పైగా ప్రతిచోటా రైతులకు కేంద్రం చేస్తున్న ద్రోహం గురించి వివరిస్తారట. దీన్నిబట్టి చూస్తుంటే తెలంగాణాలో ముందస్తు ఎన్నికల తప్పదనే అనిపిస్తోంది.