Begin typing your search above and press return to search.

అగ్రరాజ్యానికి షాకింగ్ వార్నింగ్.. రాబోయే రోజులు చీకటివే

By:  Tupaki Desk   |   28 Dec 2020 1:00 PM GMT
అగ్రరాజ్యానికి షాకింగ్ వార్నింగ్.. రాబోయే రోజులు చీకటివే
X
ప్రపంచంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తూ.. పెద్దన్న పాత్రను పోషించే అమెరికాకు కరోనా పేరుతో తగిలిన షాక్ అంతా ఇంతా కాదు. కరోనాకు ముందు అమెరికా..ఆ తర్వాత ఆగ్రరాజ్యమనే కొలమానం రానున్న రోజుల్లో ఎక్కువ కానుంది. ఆస్తి.. వ్యాపార నష్టాల్ని పక్కన పెడితే.. వైరస్ మహమ్మారి కారణంగా అమెరికన్లు పెద్ద ఎత్తున ప్రాణాలు వదలటం ఆ దేశాన్ని తీవ్రమైన షాక్ కు గురి చేస్తోంది. కరోనా కారణంగా అమెరికాకు జరిగిన నష్టం భారీ ఎత్తున ఉందంటున్న సమాచారాన్ని విశ్లేషిస్తున్న వారు అంచనా వేస్తున్నారు. ఏ సందర్భంలోనూ కరోనా కారణంగా చోటు చేసుకున్న మరణాలు లేవంటున్నారు.

ఇదిలా ఉంటే.. రానున్న రోజుల్లో కరనో తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకావం ఉందని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌఛీ చెప్పిన మాట షాకింగ్ గా మారింది. క్రిస్మస్..కొత్త సంవత్సరం సెలవులు ముగిసిన తర్వాత కరోనా కేసులు భారీ స్థాయిలో రికార్డు కానున్నట్లు చెప్పారు. మరిన్ని చీకటి రోజులు రానున్నాయి.. జాగ్రత్తగా ఉండాలని.. అప్రమత్తత అవసరమని వ్యాఖ్యానించారు.
ఫైజర్ టీకాను ఇటీవల వేసుకున్న ఆయన.. తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్టు లేవన్నారు. తన ఆరోగ్యం బాగున్నట్లుగా చెప్పారు. ఫౌఛీ లాంటి ప్రముఖుడు.. రానున్నరోజుల్లో అగ్రరాజ్యానికి కొత్త కరోనా పుణ్యమా అని.. పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యే వీలుందని చెబుతున్నారు. డిసెంబరు నెలలో రోజుకు రెండు లక్షల మంది కరోనా బారిన పడగా.. రోజుకు 3వేలకు తగ్గకుండా మరణాలు చోటు చేసుకున్నాయి. న్యూఇయర్ తర్వాత అమెరికాలో మరోసారి భారీ ఎత్తున కేసులున మోదయ్యే వీలుందంటున్నారు. మరోవైపున వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతోంది. ఇప్పటివరకు దాదాపు 20లక్షల మందికి టీకా వేసినట్లుగా చెబుతున్నారు. చాలా త్వరగా దేశంలోని రెండు కోట్ల మందికి టీకా వేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.