Begin typing your search above and press return to search.

వైసీపీ మిన‌హా వారికి ఆ ఓట్లే దిక్కా..?

By:  Tupaki Desk   |   23 Dec 2022 10:30 AM GMT
వైసీపీ మిన‌హా వారికి ఆ ఓట్లే దిక్కా..?
X
ఏపీలో వైసీపీ మిన‌హా.. మిగిలిన పార్టీల‌కు అందివ‌చ్చే ఓట్లు ఎవ‌రివి? ఎవ‌రు వైసీపీ కాకుండా ఇత‌ర పార్టీల వైపు మొగ్గు చూపుతారు? అనే విష‌యాన్నిప‌రిశీలిస్తే.. ఆస‌క్తిక‌ర విష‌యాలువెలుగు చూస్తున్నాయి.

ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న‌.. అవ‌లంబిస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలిస్తే.. ఇవ‌న్నీ.. కూడా పేద‌లకు అందుతున్నాయి. అదేస‌మ‌యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు కూడా మేలు జ‌రుగుతోంది.

సో.. ఆయా వ‌ర్గాల‌ను త‌మ‌వైపు తిప్పుకోవ‌డం.. టీడీపీ,జ‌న‌సేన వంటి పార్టీల‌కు ఇబ్బందే. ఎందుకంటే.. వైసీపీ ఇస్తున్న అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, ఇత‌ర‌త్రా ప‌థ‌కాల‌ను కానీ.. అంత‌కు మించి ఇస్తామ‌ని చెబితే త‌ప్ప‌.. వారి ఓట్లు వీరికి వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌. పోనీ అలా చెప్పే సాహ‌సం చేస్తున్నాయా? అంటే అది కూడా లేదు. సో.. పేద‌లు, మ‌హిళ‌ల ఓట్లు దాదాపు వైసీపీ వైపు ప‌డిపోవ‌డం ఖాయం.

ఇక‌, ఎటొచ్చీ.. ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. త‌మ‌కు ఏమీ చేయ‌డం లేద‌ని.. ఆలోచ‌న చేస్తున్న వారు మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గ‌మే. రాష్ట్రంలో వీరే ఎక్కువ‌గా ప‌న్నులు చెల్లిస్తున్నారు. వీరే రోడ్లు బాగోలేద‌ని.. ప‌న్నులు పెరిగిపోయాయ‌ని..ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు. సో.. ఈ నేప‌థ్యంలో వీరికి ప్ర‌భుత్వంపై స‌హ‌జంగానే ఆగ్ర‌హం వుంది. ఈ నేప‌థ్యంలో వీరు త‌ట‌స్థ ఓటు బ్యాంకుగా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో వీరిని త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తే.. మెజారిటీ ఓటు బ్యాంకును పోలింగ్ బూత్ వైపు న‌డిపించ‌గ‌లిగితే.. ఖ‌చ్చితంగా టీడీపీ కానీ, జ‌న‌సేన కానీ.. అనుకున్న‌ది సాధించే ప‌రిస్థితి ఉంటుంది.

పేద‌లను క‌దిలించాలి.. మాస్ ఓటింగును రాబ‌ట్టాల‌ని ప్ర‌య‌త్నించ‌డం మంచిదే అయినా.. జ‌గ‌న్ ప‌థ‌కాల‌కు అల‌వాటు ప‌డిపోయిన వీరినే న‌మ్ముకుంటే న‌ష్టం త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.