Begin typing your search above and press return to search.
అక్కడ సౌండ్ లేదేంటో...కేసీయార్ కే షాక్ ఇచ్చేశారే...?
By: Tupaki Desk | 1 Nov 2022 2:30 PM GMTఆయన కేసీయార్ తిమ్మిని బమ్మిని చేయడం రాజకీయ నాయకుల లక్షణం అయితే ఆయన అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు అని పేరు తెచ్చుకున్నారు. కేసీయార్ మొండి పట్టుదలతో పాటు దట్టించిన వ్యూహాలను కూడా మిక్స్ చేసి ఇలా అందరూ చేయలేని దాన్ని సాధిస్తారు. అలా తెలంగాణాను తెచ్చి ఆయన వండర్ క్రియేట్ చేశారు. ఎనిమిదేళ్ల చిల్లర కాలం ముఖ్యమంత్రిత్వం తరువాత కేసీయార్ కే బోర్ కొట్టినట్లుంది జాతీయ రాజకీయాలకు వెళ్దామనుకున్నారు. అంతే ఆయన ఈ విజయదశమి శుభవేళ చూసి తన పార్టీకి బీయారెస్ అని పేరు పెట్టేశారు.
ఇంకా మంచి ముహూర్తం చూసి ఉత్తరాదిన ఒక చోట భూనబోంతరాలు దద్దరిల్లేలా మీటింగ్ పెట్టి మరీ బీయారెస్ సభతో భారీగా లాంచ్ చేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. కేసీయార్ బీయారెస్ ని అనౌన్స్ చేసి ఇప్పటికి దాదాపుగా నెల కావస్తోంది. కానీ పక్కన ఉన్న కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి తప్పించి ఎవరూ ఆయన బీయారెస్ కి మద్దతు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ దెబ్బతో మోడీని బీజేపీని ఎదిరించేసి దేశానికి ఆల్టర్నేషన్ పార్టీని చూపిస్తాను అని జబ్బలు చరచిన కేసీయార్ కి గత నెల రోజులుగా జాతీయ రాజకీయం తీరు చూస్తే ఏమీ అర్ధం కావడంలేదు అని అంటున్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణాలో ఒక నలుగురు టీయారెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ఆపరేషన్ చేసి మరీ సర్కార్ కూల్చివేతకు తెగబడిందని కేసీయార్ పార్టీ ఎంతలా గొంతు చించుకున్నా జాతీయ స్థాయిలో అసలు సౌండ్ లేదు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్ సైలెంట్ గా ఉన్నారు.
ఏదో మొక్కుబడిగా మనీష్ సిసోడియా మాత్రం జస్ట్ ఏదో మాట్లాడారంతే. ఇక అమిత్ షతో పాటు బీజేపీకి చెందిన బీఎల్ సంతోష్ ల పేర్లు బయట పెట్టి ఢిల్లీ స్థాయిలో బం బాట్ చేయాలని కేసీయార్ చేసిన ప్రయత్నానికి మాత్రం మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, పినరాయ్ విజయన్, నవీన్ పట్నాయక్ వంటి వారు అసలు పెదవి విప్పలేదు. ఇక్కడ కూడా కుమారస్వామి మాత్రమే రియాక్ట్ అయ్యారంతే.
ఇక జాతీయ స్థాయి నేతల నుంచి పెద్ద ఎత్తున ఫోన్లు వచ్చాయని టీయారెస్ వర్గాలు ప్రచారం చేసుకోవడం తప్పితే మీడియా ముందుకు వచ్చి ఎవరూ నోరు విప్పినది లేదు అంటున్నారు. అసలు ఇలా ఎందుకు జరిగింది. కేసీయార్ లాంటి నాయకుడు అందునా జాతీయ పార్టీ పెట్టి నేషనల్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న వేళ మరీ ఇంత నిశ్శబ్దంగా ఉంటే ఎలా అన్నదే చర్చ.
అయితే కేసీయార్ నాయకత్వంలోని టీయారెస్ రెండు విడతలుగా సాగించిన తెలంగాణా ప్రభుత్వంలో అన్ని పార్టీలకు ఎరవేసి బాగానే ఫిరాయింపులను ప్రోత్సహించిందన్నది అందరికీ తెలుసు. అందుకే ఇపుడు అవతల వారు అదే ఆపరేషన్ చేసినా పెద్దగా స్పందన రాలేదని అంటున్నారు. మొత్తానికి దీనికి కేసీయార్ జాతీయ పాలిటిక్స్ కి కూడా లింక్ ఉంది అంటున్నారు.
ఆయన జాతీయ రాజకీయల పట్ల ఎవరికీ పెద్దగా అంచనాలు లేవని అంటున్నారు. అందుకే టీయారెస్ ఫామ్ హౌస్ ఆపరేషన్ ఇది అంటూ ఆడియో టేపులను బయట పెట్టి బీజేపీ ఇలా చేస్తోందని హడావుడి చేసినా జాతీయ స్థాయిలో ఎక్కడా చడీ చప్పుడూ లేదని అంటున్నారు. మరి ఇపుడే ఇలా ఉంటే బీయారెస్ పెట్టి కేసీయార్ రేపటి రోజున తిరిగినా మద్దతు ఇల లెవెల్ లో అయినా దక్కుతుందా. వెయిట్ అండ్ సీ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.