Begin typing your search above and press return to search.
మద్యం మహమ్మారికి 30లక్షల మంది బలి!
By: Tupaki Desk | 22 Sep 2018 5:07 PM GMTమద్యం మహమ్మారి బారిన పడి ఎన్నో కుటుంబాలు ప్రత్యక్షంగా - పరోక్షంగా రోడ్డున పడుతోన్న సంగతి తెలిసిందే. మద్యం సేవించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఘటనలు కోకొల్లలు. అలాగే మందుబాబుల చేతిలో ప్రమాదానికి గురై బలైన అమాయకులు మరెందరో. ఇక మద్యం సేవించడం ద్వారా కుటుంబ కలహాలు...హత్యలు - ఆత్మహత్యలు...వంటివి అదనం. ఏది ఏమైనా...మద్యం సేవించడం ఆరోగ్యానికి...ప్రాణానికి హానికరం ...అని ఎన్ని చట్టబద్ధమైన హెచ్చరికలు జారీ అవుతోన్న మందుబాబుల మనసు మారడం లేదు. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన తాజా గణాంకాలు చూసిన తర్వాత దాదాపుగా వారంతా మనసు మార్చుకోక తప్పని పరిస్థితి అని చెప్పవచ్చు. 2016లో కేవలం మద్యం సేవించన కారణంగా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు మంది చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సంచలన నిజాలు వెల్లడించింది.
ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యం సేవించడం వల్లే జరుగుతోందని ఆ నివేదికలో పేర్కొంది. `గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆర్ ఆల్కహాల్ అండ్ హెల్త్ 2018` పేరుతో శుక్రవారం నాడు ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఆ నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. మద్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చనిపోయినవారిలో పురుషులే అధికంగా ఉన్నట్లు ఆ నివేదికలో వెల్లడైంది. మందుబాబుల్లో 28 శాతం మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడటం వల్ల, 21 శాతం జీర్ణవ్యవస్థలో సమస్యల వల్ల - 19శాతం శ్వాసకోశ సమస్యల వల్ల - మిగతా శాతం ఇన్ఫెక్షన్ - క్యాన్సర్ - ఇతరత్ర జబ్బుల వల్ల మృత్యువాత పడుతున్నారని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 237 మిలియన్ పురుషులు - 46 మిలియన్ స్త్రీలు మద్యానికి బానిసలైనట్లు తెలిపింది. అమెరికా - యూరప్ - పాశ్చాత్య పసఫిక్ దేశాలకు చెందిన ప్రజలు అధికంగా మద్యం సేవిస్తున్నట్లు చెప్పింది. ఇక గత పదేళ్లలో రష్యా - మోల్డోవా - బెలారస్ దేశాల్లో మద్యం సేవించే వారి సంఖ్య తగ్గుముఖం పట్టిందని నివేదిక వెల్లడించింది.