Begin typing your search above and press return to search.

అధిక పని ఒత్తిడా? ఆశలు వదలుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   13 Nov 2019 1:30 AM GMT
అధిక పని ఒత్తిడా? ఆశలు వదలుకోవాల్సిందే
X
గుండె పోటు వస్తే ఆస్పత్రిలో స్టంట్లు వేసుకొని బతకవచ్చు. మూత్రపిండాలు, కాలేయాలు ఖరాబ్ అయితే మార్చుకోవచ్చు. షుగర్, బీపీ ఉంటే మందుల తో కంట్రోల్ చేయవచ్చు. ఏ రోగమొచ్చినా చికిత్సతో నయం చేసే పద్ధతులున్నాయి. కానీ అన్నింటి కంటే పెద్ద రోగం ఒకటుంది. అదే ఒత్తిడి.

ఈ ఉరుకులు పరుగుల జీవితం తో కాలంతో పాటు పరిగెడుతూ మనం పనులు చేస్తున్నాం. కానీ ఆ పనుల ఒత్తిడే మనిషి ని చిత్తు చేస్తోందని అమెరికా లోని వాషింగ్టన్ శాస్త్రవేత్త ల పరిశోధన లో తేలింది. అధిక ఒత్తిడి తో పని చేసే వారి శరీరం మొత్తం నాశనమవుతుందని.. అన్ని పార్ట్స్ పని చేయకుండా త్వరగా చని పోతారని శాస్త్రవేత్తలు తేల్చారు.

అధిక ఒత్తిడి కలిగి ఉండే వారి శరీరం లో ఒత్తిడికి కారణ మయ్యే 'కార్టిసాల్' అనే హార్మోన్ మెదడు లోని ఓ కేంద్రం నుంచి విడుదలవుతుందని.. ఇది నరాలను సమన్వయం చేసుకొని శరీరం లోని అన్ని భాగాలను క్రమ క్రమంగా నాశనం చేస్తోందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

మానవ జీవ చక్రాన్నే ఈ ఒత్తిడి దెబ్బ తీస్తోందని పరిశోధకులు గుర్తించారు. సో ఈ ఒత్తిడి తో చేసే పనులకు స్వస్తి పలికి.. హాయిగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉండే టెన్షన్ లేని ఉద్యోగాలు లేదా జీవితాన్ని గడపాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.