Begin typing your search above and press return to search.

లైంగికానందం కోసం భార్యల మార్పిడి.. ఇదేం సంస్కృతి?

By:  Tupaki Desk   |   11 Jan 2022 5:30 AM GMT
లైంగికానందం కోసం భార్యల మార్పిడి.. ఇదేం సంస్కృతి?
X
కార్యేషు దాసి.. కరణేషు మంత్రి.. భోజ్యేషు మాతా.. రూపేచ లక్ష్మి.. సేవలు చేయడంలో పనివంతురాలిగా.. సలహాలిచ్చే మంత్రిగా.. తల్లిలా అన్నం పెట్టే మాతాగా.. అందంలో లక్ష్మీగా ఉండే భార్యకు అత్యంత విలువ ఉంది. ఒక సంసారంలో పురుషుడి కంటే సతికి ఎక్కువే భారం ఉంటుంది. అయినా ఎంతో ఒపికతో కుటుంబాన్ని ముందుకు నడుపుతుంది. జీవితంలో సగభాగమై.. కష్టసుఖాల్లో పాలుపంచుకునే భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటే.. వారు అంతకంటే ఎక్కువ ప్రేమను పంచుతారు. కానీ మారుతున్న సమాజంలో వస్తువులకే కాదు మనుషులకు కూడా విలువ లేకుండా పోతుంది. ఆడవాళ్లను ఆదిశక్తిగా కొలుస్తారు.. కానీ కొందరు దుర్మార్గులు వారిని ఇప్పటికీ ఆటబొమ్మలుగానే చూస్తున్నారు. తల్లీదండ్రులు, కుటుంబ సభ్యులను వదిలి మెట్టినింట అడుగు పెట్టిన ఒక భార్యను కనురెప్పలా కాపాడాల్సిన బాధ్యత భర్తపై ఉంటుంది. కానీ అలాంటి భర్తే కాటేస్తే..? కోరలు చాచి విషం చిమితే..?

రోజులు మారుతున్న కొద్దీ సమాజం మారుతుంది.. ఈ క్రమంలో కొందరు పురుషులు కూడా క్రూరంగా మారుతున్నారు. ఇంటికి దీపం లాంటి ఇల్లాలును బజార్లో వేలం వేస్తున్నారు.. కనురెప్పలా కాపాడాల్సిన సతిని వేరొకరికి కట్టబెడుతున్నారు. పాశ్చాత్య పోకడలంటూ పిచ్చి పోకడలను అవర్చుకున్న కొందరు తమ భార్యలను వేరొకరికి వశం చేస్తున్నారు. కొత్త సంస్కృతి అంటూ పిచ్చి ఆటలు ఆడుతున్నారు. సాంప్రదాయాలకు మారుపేరైనా భారతదేశంలో ఇంటి గృహలక్ష్మికి ఎంతో విలువ ఇస్తాం. కానీ వీరు చేసిన పనిని చూస్తే అసలు వీళ్లు మనుషులేనా.? అన్న భావన కలుగుతుంది.

కేరళలో ఇటీవల వెలుగుచూసిన దారుణం చూసి అందరూ నోరెళ్లబెట్టుకుంటున్నారు. కొత్త కొత్త శృంగారాలకు అలవాటు పడి అసహజంగా తమ భార్యలను వేధిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తదనమంటూ ఒకరి భార్యలను మరొకరికి అప్పగిస్తున్నారు. ఇలా భార్యలను మార్చుకుంటూ శృంగారం చేస్తున్నారు. కేరళ రాష్ట్రంలో ఈ తతంగం బయటపడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హై ప్రొఫైల్ స్టడీ స్టేట్ గా పేరున్న కేరళలో ఈ సంస్కృతిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

కేరళ రాష్ట్రంలోని తన భర్త ఆగడాలను భరించలేని ఓ వివాహిత కారుకాచల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ భర్తను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు భాగోతం బయటపడింది. ఇక్కడ భార్యలను మార్చుకునే దందా కొనసాగుతుందట. దీంతో మరింత లోతుగా విచారించిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఆ తరువాత పోలీసులు రాకెట్ భాగోతం గురించి వివరించారు.

వాట్సాప్, టెలిగ్రామ్, మెసెంజర్ వేదికగా కొందరు గ్రూపుగా ఏర్పడి ఇలాంటి నీచ సంస్కృతికి పాల్పడుతున్నారు. అయితే వీరిలో ఓ మహిళ తన భర్త చేస్తున్న పనులు నచ్చక పోలీసులకు పిర్యాదు చేయడంలో అసలు విషయం బయటకొచ్చింది. కేరళలోని అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు చెందిన ఉన్నత వర్గాలే ఈ దందాలో భాగస్వాములయ్యారని పోలీసులు తెలిపారు. ఈ భాగోతంపై 25 మంది పోలీసులు పూర్తి విచారణ చేస్తున్నారని, త్వరలోనే మరికొంత మంది అరెస్టు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మితిమీరిన లైంగిక కోరికలు కలిగిన కొందరు వ్యక్తులు ఇలాంటి పాడు పనులకు పాల్పడుతున్నారని తెలిపారు.

అయితే హై ప్రొఫైల్ స్టడీ స్టేట్ గా పేరున్న కేరళలో ఇలాంటి సంస్కృతి ఉండడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత రాకెట్ సాగుతున్నా గుర్తించకపోవడం దారుణమన్నారు. అయితే చాలా మంది మహిళలను బెదరించడమో.. మరో కారణంతో బయటపడలేదని పోలీసులు అంటున్నారు. ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది. ఇలాంటి వ్యవహారంపై బాధిత మహిళలు పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.