Begin typing your search above and press return to search.

శృంగార అనుభూతి కోసం భార్యల మార్పిడి.. రాకెట్ గుట్టు రట్టు

By:  Tupaki Desk   |   10 Jan 2022 12:44 PM IST
శృంగార అనుభూతి కోసం భార్యల మార్పిడి.. రాకెట్ గుట్టు రట్టు
X
సమాజం ఎటూ పోతోంది. శృంగార అనుభూతి కోసం.. ఎంజాయ్ కోసం ఏకంగా భార్యల మార్పిడికి తెగబడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా చేశారు. కేరళ రాష్ట్రంలో బయటపడ్డ ఈ బాగోతం ఇప్పుడు వైరల్ అవుతోంది.

లైంగిక సంబంధం కోసం భార్యలను మార్పిడి చేసుకున్న రాకెట్ లో ఏడుగురు నిందితులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యల రాకెట్ బాగోతంలో దాదాపు 1000 జంటల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇతర పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తున్న భర్తపై ఓ మహిళ కారుకాచల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బట్టబయలైంది.

ఇంతకుముందు కాయంకుళం ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగుచూశాయి. భార్యల మార్పిడి రాకెట్ కేరళ రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించడానికి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లను ఉపయోగించుకుందని పోలీసులు తెలిపారు.

భార్యలను మార్పిడి చేసుకున్న వారు టెలిగ్రామ్, మెసెంజర్ గ్రూపులలో చేరారు. అలా ఒకరినొకరు కనెక్ట్ అవుతారు. ఫిర్యాదు చేసిన మహిళ భర్తను అదుపులోకి తీసుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది.

ఇక ఈ భార్యల మార్పిడి వెనుక చాలామంది పాత్ర ఉందని.. ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని చంగంచెరి డీఎస్పీఆర్ శ్రీకుమార్ తెలిపారు. నిందితులు అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు చెందిన వారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, ఉన్నత వర్గాలకు చెందిన వారు ఈ రాకెట్ లో భాగమని పోలీసులు నిర్ధారించారు. భార్యల మార్పిడి భాగోతంపై 25 మంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత మందిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.