Begin typing your search above and press return to search.
కారులో మద్యం తరలిస్తూ పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ.. సస్పెండ్
By: Tupaki Desk | 30 March 2020 9:50 AM GMTకరోనా వైరస్ దేశాన్ని పట్టి పీడిస్తున్న నేపథ్యంలో ..ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ఈ లాక్ డౌన్ కూడా ఒకటి. ప్రజలని ఎక్కువ మొత్తం లో ఒక చోట గుమ్మి గూడకుండా చేయగలిగితే కరోనాని అరికట్టవచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది. లాక్ డౌన్ తో ప్రభుత్వ యంత్రాంగాలు ప్రతి నిమిషం చాలా అప్రమత్తంగా ఉంటున్నాయి. అయినా కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంగా రోడ్ల మీదకు వచ్చి లాక్ డౌన్ కు భంగం కలిగిస్తున్నారు.
మరోవైపు కొందరు బాధ్యత గల అధికారులు కూడా తప్పుదోవ పడుతున్నారు. మద్యాన్ని పూర్తిగా బంద్ చేసినా తూర్పు గోదావరి జిల్లా, రాయవరం ఎక్సైజ్ సీఐ అయిన రెడ్డి త్రినాథ్ మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. మార్చి 29 కారులో సీఐ అక్రమంగా మద్యం తరలిస్తున్నారని అనపర్తి ఎమ్యెల్యేకి సమాచారం అందింది. దీంతో ఆయన స్థానికులతో కలిసి సీఐ కారును పట్టుకున్నారు. అయితే సీఐ మాత్రం తనిఖీల్లో భాగంగానే వచ్చానని బుకాయించే ప్రయత్నం చేశారు.
ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయణ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టుగా.. ఎక్సైజ్ శాఖలో కొందరు దొంగ అధికారుల తీరు దారుణంగా ఉంది. బాధ్యతగల వృత్తిలో ఉండి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి అక్రమాలు ఎవరు చేసినా తీవ్ర చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో పోలీసు సిబ్బంది మొత్తం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులను నిర్వర్తిస్తున్నారు. అయితే కొందరి కారణంగా పోలీసులు ప్రదర్శిస్తున్న స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. కాగా, ఈ చర్యపై మండిపడ్డ మంత్రి సీఐను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌తో పాటు రూ.5 లక్షల జరిమానా కూడా విధించినట్లు మంత్రి తెలిపారు. త్రినాథ్‌పై శాఖాపరమైన విచారణకు అదేశించామని..ఇలాంటి అక్రమాలు ఎవరు చేసినా తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.