Begin typing your search above and press return to search.
దేశ చరిత్రలో తొలిసారి .. ఒకేసారి 9 మందికి ఉరి శిక్ష .. ఏం చేశారంటే ?
By: Tupaki Desk | 6 March 2021 7:30 AM GMTకల్తీ సారా విషాదం కేసులో స్పెషల్ ఎక్సైజ్ కోర్టు సంచలన తీర్పుని వెల్లడించింది. 2016 లో బీహార్ లోని గోపాల్ గంజ్ లో జరిగిన నాటు సారా విషాదం కేసులో తొమ్మిది మందికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఒకే కేసులో ఇంత మందికి ఉరిశిక్ష పడటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో పాటు ఈ కేసులో మరో నలుగురు మహిళా నిందితులకు యావజ్జీవ కారాగా శిక్షను ఖరారు చేసింది. జీవితకాల శిక్ష పడిన మహిళలకు పది లక్షల జరిమానాను కూడా విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
2016 ఆగస్ట్ లో గోపాల్ గంజ్ లోని ఖర్జుర్ బని ప్రాంతంలో జరిగిన నాటుసారా విషాద ఘటనలో 21 మంది మరణించారు. చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు కంటిచూపును కూడా కోల్పోయారు. ఈ కేసుపై అప్పటినుంచి కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తేదీ ఇచ్చిన తీర్పులో 13 మందిని దోషులుగా తేల్చుతూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ కేసులో మరణశిక్ష పడిన 9 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విశేషం.
2016 ఆగస్టులో గోపాల్ గంజ్ జిల్లాలోని ఖర్జుర్ బానీ ప్రాంతంలో నాటు సారా తాగిన ఘటనలో 21 మంది ప్రాణాలుకోల్పోగా, కొందరు కంటి చూపు కోల్పోయారు. ఇదే కేసులో అప్పుడు పోలీసులపై కూడా చర్యలు తీసుకున్నారు. 21 మంది పోలీసులను విధుల నుంచి తొలగించారు. వారిలో ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఉన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించరంటూ పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేశారు.