Begin typing your search above and press return to search.

ఏపీ పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ

By:  Tupaki Desk   |   4 April 2021 4:30 PM GMT
ఏపీ పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ
X
ఏపీలో పరిషత్ ఎన్నికలు జరుగుతాయా? వాయిదా పడుతాయా? అన్నది ఉత్కంఠగా మారింది. పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్టులో ఆదివారం వాదనలు ముగిశాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ బీజేపీ, జనసేన దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు వాదనలు పూర్తయ్యాయి. ఆ తర్వాత దీనిపై ఎస్ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

పరిషత్ ఎన్నికలపై ఆదివారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచే కొనసాగిస్తున్నట్లు ఎస్ఈసీ తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలింగ్, లెక్కింపు ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందన్నారు. ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఎస్ఈసీ తరుఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది. ఎల్లుండి హైకోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుంది? ఎన్నికలను వాయిదా వేస్తారా? కొనసాగిస్తారా? ఎన్నికల ప్రక్రియ ఎక్కడి నుంచి కొనసాగిస్తారన్నది వేచిచూడాలి.

పరిషత్ ఎన్నికల్లో పోటీచేయవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ నేతల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలు దీనిపై హైకోర్టుకు ఎక్కారు. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.