Begin typing your search above and press return to search.
ఎన్ కౌంటర్.. ఆక్కడ ఇలా జరిగింది!
By: Tupaki Desk | 6 Dec 2019 8:33 AM GMTదిశ హంతకులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సినీ - రాజకీయ - మేధావులు - ప్రజలు - మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శంషాబాద్ లోని చట్రాన్ పల్లి వద్ద ఈ ఉదయం తెల్లవారుజామున దిశను ఎక్కడైతే చంపారో అక్కడే సీన్ రికన్ స్ట్రక్షన్ చేయడానికి పోలీసులు నలుగురు నిందితులను అక్కడికి తీసుకెళ్లారు. ఈ సమయంలోనే నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతోపాటు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు.
కాగా దిశను కాల్చేసిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి 300 మీటర్ల దూరంలో పొలాల మధ్యలో నలుగురి శవాలు కొద్దిదూరం తేడాలో పడి ఉన్నాయి. స్పాట్ లోనే నిందితుల మృతదేహాలకు ఆర్టీవో ఆధ్వర్యంలో నలుగురు తహసీల్దార్లు పంచనామా నిర్వహించారు.
ఎన్ కౌంటర్ జరిగిన చుట్టూ నలుగురి శవాలు పడి ఉన్న ప్రదేశంలో పోలీసులు ‘డునాట్ క్రాస్ ’ ట్యాగ్స్ పెట్టి ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సున్నిత కేసు కావడంతో అక్కడే పంచనామా చేయడానికి పోలీసులు పూనుకున్నారు.