Begin typing your search above and press return to search.

ఈ దేశాల్లో రేప్ చేస్తే ఏం చేస్తారో తెలుసా?

By:  Tupaki Desk   |   9 Dec 2019 1:30 AM GMT
ఈ దేశాల్లో రేప్ చేస్తే ఏం చేస్తారో తెలుసా?
X
గల్ఫ్ లో రేప్ చేస్తే నడిరోడ్డుపై తల నరికేస్తారట.. ఇక మరో దేశంలో నడిరోడ్డుపై ఉరితీస్తారట.. భారత్ లోనూ అలా జరగాలని దిశ హత్యాచారం తర్వాత అందరూ గళమెత్తారు. చట్టాలు మార్చాలని నినదించారు.. దిశ నిందితుల ఎన్ కౌంటర్ తో ప్రజలంతా సంతోషించారు. కానీ దేశంలో ఇది న్యాయం కాదని మానవ హక్కుల సంఘాలు, కోర్టులు తప్పుపడుతున్నాయి.

హైదరాబాద్ లో దిశపై అత్యాచారం హత్య, ఉన్నావ్ లో అత్యాచార బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పు.. ప్రజల ఆగ్రహావేశాలకు అనుగుణంగా దేశంలో చట్టం న్యాయం తక్షణమే జరగదని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు.. విచారణ ప్రకారమే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్భయ నిందితులను ఏడేళ్లు అయినా ఊరితీయకుండా కాపాల కాస్తున్న దేశం మనది. దేశంలో ఉరిశిక్షనే అంతిమశిక్ష. మన దేశంలో న్యాయం పరిస్థితి ఇలా ఉంటే.. పరాయి దేశాల్లో రేప్ చేస్తే మాత్రం చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి.

*గల్ఫ్ లో చట్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సౌదీ అరేబియాలో అత్యాచారం చేస్తే బహిరంగంగా అందరిముందే వారి తల నరికేస్తారు..

*సౌదీ పక్కనే ఉండే ఇరాన్ లో రేప్ చేసిన వారికి బహిరంగంగా ఉరితీస్తారు.

*పాకిస్తాన్ లో రేప్ నిందితులకు మనలాగే ఉరిశిక్ష విధిస్తారు.

*ఉత్తరకొరియాలో రేప్ చేసిన వారిని బహిరంగంగానే బుల్లెట్ల వర్షం కురిపించి చంపేస్తారు.

*అప్ఘనిస్తాన్ లో రేప్ చేసిన నాలుగు రోజుల్లోనే విచారణ జరిపి నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపేస్తారు. అందుకే అప్ఘనిస్తాన్ లో రేప్ ల సంఖ్య చాలా తక్కువ.

*ఈజిప్ట్ లో రేప్ చేస్తే ఉరిశిక్షను అమలు చేస్తారు.

*ఇక మన పొరుగుదేశం చైనాలోనూ కోర్టులో రేప్ చేసినట్టు రుజువైతే తుపాకీతో కాల్చి చంపుతారు.

*ఇక అగ్రరాజ్యం అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో యావజ్జీవ శిక్ష విధిస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో 15-30 ఏళ్ల శిక్ష వేస్తారు.