Begin typing your search above and press return to search.
23 రోజుల్లోనే ఉరి శిక్ష ఖరారు ... దేశ చరిత్రలో సంచలనం !
By: Tupaki Desk | 21 Jan 2021 10:30 AM GMTవంద మంది నేరస్థులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదన్నది భారతీయ న్యాయసూత్రం. అందుకే నేరస్థులకు శిక్షలు ఖరారు చేయడం, వాటిని అమలు చేయడంలో కాస్త ఆలస్యం జరుగుతుంటుంది. కరుడుగట్టిన నేరస్థులకు శిక్ష విధించాలన్నా ఏళ్ల తరబడి సమయం తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. కేవలం 23 రోజుల్లోనే ఓ నేరాన్ని నిరూపించడం, ఆ నేరానికి పాల్పడిన వ్యక్తికి ఉరి శిక్షను ఖరారు చేయడం జరిగిపోయాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ....ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లోని కవీనగర్ ప్రాంతంలో ఓ రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అంతేకాకుండా ఆ బాలిక ప్రాణాలను కూడా తీసేశాడు. 2020వ సంవత్సరం అక్టోబర్ 21న ఈ విషాధ ఘటన జరిగింది. తన కూతుర్ని ఎవరో అత్యాచారం చేసి చంపేశారని తెలిసి ఆ బాలిక తండ్రి వెంటనే ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
ఈ కేసును సవాల్ గా తీసుకున్న ఘజియాబాద్ పోలీసులు కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ఈ కేసులో నిందితుడిని పట్టుకున్నారు. బాలిక తండ్రి స్నేహితుడే ఈ దురాగతానికి పాల్పడ్డాడని విచారణలో పోలీసులు కనిపెట్టారు. దీంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసి ఫోక్సో కోర్టులో హాజరుపరిచారు. గతేడాది డిసెంబర్ 29న కోర్టులో ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును పోలీసులు సబ్మిట్ చేశారు.
కేసు తీవ్రతను బట్టి ఫోక్సో కోర్టు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చింది. నిందితుడు కూడా నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. ఫోరెన్సిక్ నివేదికలో ఆధారాలు కూడా దొరికాయి. మొత్తానికి ఫోక్సో కోర్టులో అతడిని హాజరు పరిచిన సరిగ్గా 23 రోజులకు, బుధవారం నాడు ఫోక్సో కోర్టు తుది తీర్పును వెల్లడించింది. దేశం లోనే అత్యంత వేగంగా విచారణ జరిగి, శిక్ష కూడా ఖరారు కేసుల జాబితాలో ఇది కూడా రికార్డులకెక్కింది.