Begin typing your search above and press return to search.
విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్..భీమిలికి మహార్ధశేనట!
By: Tupaki Desk | 21 Dec 2019 4:39 PM GMTఇప్పుడు ఎక్కడ చూసినా... ఏపీకి మూడు రాజధానుల మాటే వినిపిస్తోంది. దాని పైనే ఎడతెగని చర్చలూ నడుస్తున్నాయి. మొత్తంగా జగన్ నోట నుంచి వచ్చిన మూడు రాజధానుల మాట... నిన్నటి దాకా రాష్ట్రంలో పెద్ద సమస్యలుగా పరిగణించిన ఇంగ్లీష్ మీడియం - అన్యమత ప్రచారం తదితరాలన్నీ మాయం అయిపోయాయి. ఇప్పుడంతా రాజధానిపైనే చర్చ. అది కూడా విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పైనే చర్చ. ఇలాంటి క్రమంలో విశాఖలో ఏర్పాటు కానున్న ఎగ్జిక్యూటివ్ కేపిటల్ వల్ల జరిగే మార్పుల గురించి వైసీపీ ప్రధాన కార్యదర్శి - ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ మాటలు ఎన్నికలకు ముందు టీడీపీకి - ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి రాజీనామా చేసి పారేసి... వైసీపీలో చేరడమే కాకుండా భీమిని నియోజకవర్గం నుంచి బంపర్ విక్టరీ కొట్టి ఏకంగా జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ కు మరింతగా సంతోషాన్నిచ్చాయనే చెప్పాలి.
భీమిలిలో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాలు పంచుకున్న విజయసాయిరెడ్డి.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని వల్ల ఆ ప్రాంతానికి కలిగే లబ్ధిపై చాలా క్లారిటీగానే ప్రసంగించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తో భీమిలి దశ, దిశ... రెండూ మారిపోతాయని సాయిరెడ్డి చెప్పారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తో భీమిలి సాధారణ పట్టణం స్థాయి నుంచి మహా పట్టణం స్థాయిని సంతరించుకుంటుందని కూడా సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా విశాఖలో ఏర్పాటయ్యే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ భీమిలి కేంద్రంగానే ఏర్పాటు కానుందని కూడా సాయిరెడ్డి తెలిపారు. మంత్రి అవంతి శ్రీనివాస్ - సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో భీమిలిలో రాజధాని ఏర్పాటు కానుండటం సంతోషంగా ఉందని కూడా సాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సాయిరెడ్డి మాటలతో సదరు సమావేశంలో పాలుపంచుకున్న అవంతి శ్రీనివాస్ తో పాటు ఎంపీ సత్యనారాయణ మూర్తి కూడా ఉబ్బితబ్బియ్యారని చెప్పక తప్పదు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటూ జగన్ ప్రకటన, ఆ మేరకే జీఎన్ రావు కమిటీ నివేదిక అందజేయడం, తాజాగా ఏకంగా విశాఖలో ఏర్పాటు కానున్న ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కు భీమిలే కేంద్రం కానుందని స్వయంగా సాయిరెడ్డి ప్రకటించడంతో అవంతితో పాటు మూర్తిల ఆనందానికి పట్ట పగ్గాల్లేకుండా పోయాయని చెప్పక తప్పదు. రాజధాని రాకతో తన నియోజకవర్గంలో మెరుగైన రీతిలో అభివృద్ధి సాధిస్తుందన్న విషయం తెలిసిన నాటి నుంచి అవంతి ఆనందంలో మునిగిపోగా... తాజాగా సాయిరెడ్డి ప్రకటనతో ఆ ఆనందం మరింతగా పెరిగిందనే చెప్పాలి.