Begin typing your search above and press return to search.
ఐపీఎల్ నుంచి విదేశీ ఆటగాళ్ల నిష్క్రమణ.. అదీ మన మంచికే..!
By: Tupaki Desk | 28 April 2021 4:46 AM GMTప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. మనదేశానికి రావాలంటేనే విదేశీయులు భయపడుతున్నారు. కరోనాతో రోజుకు వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణ అవసరమా? అన్న చర్చ జరుగుతోంది. అయితే ఐపీఎల్ లో ప్రేక్షకులకు అనుమతి లేదు పైగా బయోబబుల్ పద్ధతిలో ఈ సిరీస్ ను నిర్వహిస్తున్నందున కరోనా వ్యాప్తి చెందదు. అనేది బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకుల వాదన. ఇదిలా ఉంటే వివిధ దేశాలు భారత్తో విమాన రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి.
ఈ క్రమంలో విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ ను వీడారు. ఇదిలా ఉంటే విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ ను వీడినా ఇబ్బంది ఏమీ లేదన్న వాదన తెరమీదకు వస్తున్నది. విదేశీ ప్లేయర్లు వెళ్లిపోతే ఆ స్థానంలో మన దేశ ఆటగాళ్లకు అవకాశం వస్తుందని.. తద్వారా మనదేశ క్రికెటర్ల ట్యాలెంట్ ప్రపంచానికి తెలుస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ కు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఉంది. ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు ఆడటం కూడా అందుకు ఓ కారణం. ఇదిలా ఉంటే చాలా మంది దేశీయ ఆటగాళ్లు ఐపీఎల్ తో తమ సత్తా నిరూపించుకున్నారు.
నటరాజన్, సిరాజ్ లాంటి ఆటగాళ్లు ఐపీఎల్ తో ఫేమస్ అయ్యారు. శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాంత్ కిషన్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఐపీఎల్ తో తమ సత్తా చాటారు.మరోవైపు ప్రతి జట్టు నలుగురు విదేశీ ఆటగాళ్లను ఆడించొచ్చు. దీంతో అన్ని జట్లలో విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.అయితే ఒకవేళ విదేశీ ఆటగాళ్లు వెళ్లిపోయినా .. ఐపీఎల్ ఆపే ప్రసక్తే లేదని ఇప్పటికీ బీసీసీఐ ప్రకటించింది. విదేశీ ఆటగాళ్లు ఆడకపోతే .. మనదేశ ఆటగాళ్లకు అవకాశం వస్తుందన్న వాదన కూడా వినిపిస్తుంది.