Begin typing your search above and press return to search.

బీహార్ లో సర్వేల పోటీ

By:  Tupaki Desk   |   11 Oct 2015 5:30 PM GMT
బీహార్ లో సర్వేల పోటీ
X
ప్రధాని నరేంద్ర మోడీకి - నితీష్ కుమార్ యాదవ్‌ ల మధ్య పోరుగా మారిన బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎవరూ అంచనాలు వేయలేకపోతున్నారు. ఒక్కో సర్వే ఒక్కో రకమైన ఫలితాలు అంచనా వేస్తోంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ హవాతో బిజెపి క్లీన్ స్వీప్ చేసింది. బీహార్ లోను బిజెపి సత్తా చాటింది. ఆ తర్వాత వచ్చిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తుడిచి పెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికలు ప్రధాని మోడీ హవా ఇంకా ఉందో .. పోయిందో చెప్పడానికి కొలమానంగా మారనున్నాయి. మరోవైపు, బిజెపితో తెగతెంపులు చేసుకోవడం, అవినీతి మకిలి అంటిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో జత కట్టిన నేపథ్యంలో నితీష్ కుమార్‌కు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవే. ప్రధాని పదవిని ఆశించిన నితీష్.. అది మోడీకి దక్కడంతో బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు. దీంతో, ఈ ఎన్నికలు.. ప్రధానంగా మోడీ వర్సెస్ నితీష్ కుమార్‌విగా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సర్వేలు బీహార్ ఫలితాలపై అంచనాలు వెలువరిస్తున్నాయి. మొన్నటి వరకు నితీశ్ కు అనుకూలంగా సర్వేలు రాగా శనివారం కొన్ని సర్వేలు ఎన్టీయేకు అనుకూలంగా ఫలితాలు రావొచ్చని అంచనాలు వేశాయి.

సర్వేలు ఇలా...

1) జీ న్యూస్- జనతా కా మూడ్ సర్వే

బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేకు 162 - జేడీయూ - ఆర్జేడీ - కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమికి 51 స్థానాలు.
243 సీట్ల బీహార్ అసెంబ్లీలో కనీస మెజార్టీకి 122 స్థానాలు అవసరం కాగా.. ఎన్డీయే 162 సీట్లతో మూడింట రెండొంతుల స్థానాలు దక్కించుకుంటుందని తేలిందని ఈ సర్వే తెలిపింది. ఎన్డీయేకు 54.8 శాతం ఓట్లు, లౌకిక కూటమికి 40.2 శాతం ఓట్లు, ఇతరులకు 6 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. యాదవులు ఎక్కువగా లౌకిక కూటమికి మద్దతు పలకగా, మిగతా సామాజిక వర్గం వారు ఎన్డీయేకు ఎక్కువగా మద్దతు పలికారు. ముస్లీముల్లో 58 శాతం లౌకిక కూటమికి, 35 శాతం బిజెపికి మద్దతు పలికినట్లు సర్వేలో వెల్లడైంది.

.. దీనికి కొద్దిరోజుల ముందు విడుదల చేసిన ఓ సర్వేలో జీ న్యూస్ ఎన్డీయేకు 147 సీట్లు వస్తాయని పేర్కొంది. తాజా సర్వలే సీట్లు 15 పెరిగాయి.

2) సీఎన్ఎన్ - ఐబీఎన్ - యాక్సిస్ సర్వే:
బిజెపి కూటమి 95 సీట్లు, 38 శాతం ఓట్లు
లౌకిక కూటమికి 137 సీట్లు, 46 శాతం ఓట్లు

3) ఐటీజీ - సిసెరో:
బిజెపి కూటమి 111 సీట్లు, 39 శాతం ఓట్లు
లౌకిక కూటమికి 122 సీట్లు, 41 శాతం ఓట్లు

4)సీ ఓటర్
బిజెపి కూటమి 119 సీట్లు, 43 శాతం ఓట్లు
లౌకిక కూటమికి 116 సీట్లు, 41 శాతం ఓట్లు

5) టైమ్స్ నౌ - సీ ఓటర్
బిజెపి కూటమి 117 సీట్లు, 43 శాతం ఓట్లు
లౌకిక కూటమికి 112 సీట్లు, 42 శాతం ఓట్లు.

6) ఏబీపీ నీల్సన్
బిజెపి కూటమి 128 సీట్లు, 42 శాతం ఓట్లు
లౌకిక కూటమికి 112 సీట్లు, 40 శాతం ఓట్లు.

7) ఇండియా టూడే-సిసెరో:
బిజెపి కూటమి 125 సీట్లు, 42 శాతం ఓట్లు
లౌకిక కూటమికి 106 సీట్లు, 40 శాతం ఓట్లు.

8)న్యూస్ నేషన్:
బిజెపి కూటమి 111 - 115 సీట్లు, 42 శాతం ఓట్లు
లౌకిక కూటమికి 125-129 సీట్లు, 45 శాతం ఓట్లు.