Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్: పబ్లిక్ పల్స్ సర్వేలో బీజేపీదే విజయం

By:  Tupaki Desk   |   30 Oct 2021 2:38 PM GMT
ఎగ్జిట్ పోల్స్: పబ్లిక్ పల్స్ సర్వేలో బీజేపీదే విజయం
X
అన్నుకున్నట్టే అయ్యింది.. టీఆర్ఎస్ కోట్లు కుమ్మరించినా వారి కొంప కొల్లేరయ్యేలానే ఉంది. దళితబంధు, పథకాలు, అభివృద్ధి చేసినా హుజూరాబాద్ లో సానుభూతి మంత్రమే పనిచేసిందని ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. హుజూరాబాద్ లో పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. అందులో ఈటల రాజేందర్ గెలుస్తాడని ఢంకా బజాయిస్తున్నారు.

రీసెర్చ్ అండ్ అనాలసిస్ బై పబ్లిక్ పల్స్ సర్వే ఏజెన్సీ చేసిన సర్వేలో బీజేపీ గెలుపు ఖాయమని తేలింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 44.3శాతం, బీజేపీకి 50.9శాతం , కాంగ్రెస్ కు 2.7శాతం, ఇతరులకు 2.1శాతం ఓట్లు వస్తాయని తేలింది. మొత్తంగా ఈటల రాజేందర్ 9వేల నుంచి 12వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని ఎగ్జిట్ పోల్ సర్వే తేల్చింది.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని మండలాల వారీగా చూస్తే హుజూరాబాద్ మండలంలో బీజేపీ ఆధిక్యం సాధిస్తుందని తేలింది. అలాగే జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్, జమ్మికుంట లలో బీజేపీ ఆధిక్యం స్ఫష్టంగా కనిపించదని సర్వే తేల్చింది.

ఇక టీఆర్ఎస్ కు కేవలం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత మండలం టీఆర్ఎస్ తోపాటు హుజూరాబాద్ మున్సిపాలిటీలో మాత్రం ఆధిక్యం లభిస్తుందని తేలింది.

-ఈటెల గెలుపునకు కారణాలివీ

ఈటల రాజేందర్ మొదటి నుంచి నియోజకవర్గ ప్రజలంతా సత్సంబంధాలు కలిగి ఉండడం ఎన్నికల్లో ఆయనకు బలంగా మారింది.. అభివృద్దితోపాటు వ్యక్తిగత సహాయాలు హుజూరాబాద్ ప్రజలు బీజేపీ వైపు మొగ్గడానికి దోహదం చేశాయి. టీఆర్ఎస్ తరుఫున గెల్లు శ్రీనివాస్ పూర్తిగా నియోజకవర్గ ప్రజలకు తెలియకపోవడం మైనస్ గా మారింది. ఈటల అందరికీ తెలిసిన వ్యక్తి కావడం ప్లస్ అయ్యింది

టీఆర్ఎస్ తప్పితే మిగతా అన్ని పార్టీలు ఇక్కడ ఈటలకు సపోర్టు చేయడం ఆయన గెలుపునకు దోహదం పడింది. ఇక్కడ ఎన్నిక కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్టుగా ప్రజలు భావించి ఈటెలను గెలిపించుకున్నారని తేలింది.