Begin typing your search above and press return to search.
గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ అడ్డంగా ఫెయిల్
By: Tupaki Desk | 18 Dec 2017 5:43 AM GMTఎన్నికలు ఎక్కడ జరిగినా.. వెంటనే ఫలితాలు వెలువడకున్నా.. ఓటింగ్ సరళిని లెక్క కట్టే విషయంలో ఎగ్జిట్ పోల్స్ కీలక భూమిక పోషిస్తుంటాయి. వీటి ఆధారంగానే తుది ఫలితం ఎలా ఉంటుందన్న విషయంపై ఒక అవగాహన ఉంటుంది. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియా అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
ప్రతి మీడియా సంస్థ తనకున్న నెట్ వర్క్ తో ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించింది. గుజరాత్ ఎన్నికలు ముగిసిన వెంటనే పది ప్రముఖ మీడియా సంస్థలు తమ పోల్స్ ను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంస్థల్లో ఏ ఒక్కరూ దగ్గరకు రాలేదు (5 శాతం అటూ ఇటూగా లెక్కేస్తే). ఒకరిద్దరు వచ్చినా మినిమం.. మ్యాగ్జిమ్ లెక్కతో సేఫ్ గేమ్ ఆడారు. అలాంటి లెక్కల్ని పరిగణలోకి తీసుకోకుంటే.. ఏ ఒక్కరు కూడా తాము వెల్లడించిన ఫలితాలకు 5 శాతం కుడి ఎడమల వద్దకు చేరుకోలేదని చెప్పక తప్పదు.
కాకుంటే.. ఫలితం ఎలా ఉంటుందన్న అంచనాకు కాస్త దగ్గరగా మాత్రం ఐదు మీడియా సంస్థలు వచ్చాయని చెప్పాలి. అయితే.. వీరు చెప్పిన జోస్యం.. తుది ఫలితంతో పోల్చినప్పుడు ఆరేడు శాతం వ్యత్యాసంతో ఉండటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బీజేపీకి వచ్చే సీట్ల విషయంలో చాలామంది తప్పుడు అంచనాలతో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు వచ్చే సీట్ల లెక్క విషయంలో మాత్రం ఐదు మీడియా సంస్థలు చాలా దగ్గరకు రావటం విశేషంగా చెప్పాలి.
ఈ ఆర్టికల్ రాస్తున్న సమయానికి (ఉదయం 10.30గంటలు) బీజేపీ 103 స్థానాల్లో అధిక్యతలో ఉంది. ఇప్పటివరకు ఏ ఒక్కస్థానంలోనూ అధికారికంగా విజయాన్ని వెల్లడించలేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడుఅధిక్యతలో ఉన్న స్థానాల్లో రెండు మూడు స్థానాలకు మించి తుది ఫలితంలో తేడా వస్తుందని చెప్పలేం. అంటే.. బీజేపీ 100 మార్క్ ను ఖాయంగా దాటినట్లే. అదే సమయంలో కాంగ్రెస్ మిత్రపక్షాలు 72 స్థానాలను ఖాయంగా గెలుచుకున్నట్లే.
దీని ప్రాతిపదికన ఎగ్జిట్ పోల్స్ ను సరిపోల్చితే.. వారి అంచనాలకు వాస్తవానికి మధ్య తేడా ఇట్టే తెలిసిపోతుంది.
గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ లో ఏ మీడియా సంస్థ బీజేపీ.. కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పిందో చూస్తే..
మీడియా సంస్థ బీజేపీ కాంగ్రెస్
వీడీపీఏ 142 37
చాణుక్య 135 47
సీఎస్ డీఎస్-ఏబీపీ 117 64
సీఎన్ ఎక్స్ -న్యూస్ ఎక్స్ 110-120 65-75
ఎన్డీటీవీ 112 70
వీఎంఆర్ 108-118 61-71
రిపబ్లిక్ టీవీ 108 74
సి-ఓటర్-టీవీ 9 108 74
యాక్సిస్ 99-113 68