Begin typing your search above and press return to search.
ఢిల్లీ కింగ్ కేజ్రీనే..ఎగ్జిట్ పోల్స్ చెప్పిందిదే!
By: Tupaki Desk | 8 Feb 2020 2:10 PM GMTఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోమారు పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. శనివారం ఉదయం ప్రారంభమై... సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో కేజ్రీకి తిరుగే లేదన్న రీతిలో ఢిల్లీ ఓటర్లు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పాలి. 70 సీట్లున్న అసెంబ్లీలో 36 స్థానాలు గెలిచే పార్టీదే అధికారం. అయితే కేజ్రీ నేతృత్వంలోని ఆప్... ఈ సారి ఏకంగా 49 స్థానాలను గెలుస్తుందని దాదాపుగా అన్ని సంస్థలు అంచనా వేశాయి. ఇప్పటిదాకా నాలుగు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేయగా... అన్నింటిలోనూ కేజ్రీ పార్టీదే విజయమని చెప్పేశాయి.
ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన ఆయా సంస్థల ఫలితాలను ఓ సారి పరిశీలిస్తే... న్యూస్ ఎక్స్- నేతా సంస్థ విడుదల చేసిన ఫలితాల్లో ఆప్ కు 53 నుంచి 57 స్థానాలు దక్కనుండగా, బీజేపీకి 11 నుంచి 17 స్థానాలు దక్కుతాయట. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సీట్లతోనే సరిపెట్టుకోక తప్పదని ఈ పోల్స్ తేల్చేసింది. ఇక రిపబ్లిక్ టీవీ- జన్ కీ బాత్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ ఫలితాల్లో ఆప్ 48 నుంచి 61 స్థానాలను కైవసం చేసుకోనుండగా - బీజేపీకి 9 నుంచి 21 స్థానాలు వస్తాయట. కాంగ్రెస్ పార్టీకి ఈ పోల్స్ లో కేవలం సింగిల్ సీటు మాత్రమే దక్కింది. ఇక టైమ్స్ నౌ-ఐపీఎస్ ఓఎస్ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ కు 44 సీట్లు - బీజేపీకి 26 సీట్లు దక్కనుండగా... కాంగ్రెస్ కు సింగిల్ సీటు కూడా దక్కదట. మొత్తంగా ఈ మూడు ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన ఫలితాలను కలిపి చూసుకున్నా... ఆప్ కు 49 నుంచి 56 సీట్లు - బీజేపీకి 12 నుంచి 19 సీట్లు - కాంగ్రెస్ కు రెండు సీట్లు వస్తాయట.
మొత్తంగా 2015లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినంత పని చేసిన ఆప్... ఇప్పుడు కూడా తనదైన శైలి ప్రభంజనం సృష్టించనుందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఆప్ ను ఎలాగైనా దెబ్బతీయాలన్న కసితో సాగిన బీజేపీకి ఈ దఫా కూడా ఢిల్లీలో శృంగభంగమేనన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇక ఆప్ కంటే ముందు ఏకంగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూడనుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.