Begin typing your search above and press return to search.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్: యూపీలో గెలుపెవరిదంటే?

By:  Tupaki Desk   |   7 March 2022 1:53 PM GMT
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్: యూపీలో గెలుపెవరిదంటే?
X
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 690 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడు విడతల్లో జరిగిన ఎన్నికలు నేటితో ముగిశాయి. ఫిబ్రవరి 10న మొదలైన అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం మొత్తం ఏడు విడతల్లో కొనసాగింది.

ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు దశల్లో పోలింగ్ పూర్తయ్యింది. పంజాబ్ లో 117, ఉత్తరాఖండ్ లో 70, మణిపూర్ లో 60, గోవాలో 40 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ ముగిసింది.

దేశంలోనే కీలకమైన పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో రెండోసారి బీజేపీనే అధికారం చేపడుతుందని మెజార్టీ సంస్థలు అంచనావేశాయి. ఇక పంజాబ్ లో కాంగ్రెస్ అనూహ్యంగా ఓడిపోయి ఆ స్థానంలో ఆమ్ ఆద్మీ అధికారంలోకి వస్తుందని తేలింది. ఇక ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఖాయం అని తేలింది. గోవాలోనూ కాంగ్రెస్, బీజేపీకి సమాన సీట్లు వస్తాయని సర్వేలు తేల్చాయి.

-ఎగ్జిట్ పోల్స్ అంచనాలు (ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 403 సీట్లు)
-న్యూస్ ఎక్స్ -పోల్ స్టార్: బీజేపీకి 211-222, ఎస్పీ కూటమి 140-160, బీఎస్పీ 12-22
-పీ మార్క్ : బీజేపీకి 225-250, ఎస్పీ కూటమి 130-155, బీఎస్పీ 12-22, కాంగ్రెస్ 2-6, ఇతరులు 2
మ్యాటిక్స్ : బీజేపీకి 262-277, ఎస్పీ 119-134, బీఎస్పీ 7-15, కాంగ్రెస్ 3-8, ఇతరులు 2,
ఆత్మసాక్షి: బీజేపీ 138-140, ఎస్పీ 235-240, బీఎస్పీ 19-23, కాంగ్రెస్ 6

-పంజాబ్ 117 సీట్లు
-న్యూస్ ఎక్స్ -పోల్ స్టార్: బీజేపీకి 1-6, కాంగ్రెస్ 24-29, ఆప్ 56-61, ఇతరులు 6
-పీ మార్క్ : ఆప్ 60-84, కాంగ్రెస్ 18-31, ఎస్ఏడీ 12-19, ఇతరులు 1
-మ్యాటిక్స్ : ఆప్ 62-70, కాంగ్రెస్ 23-31, ఎస్ఏడీ 18-21, ఇతరులు 3-7,
-ఆత్మసాక్షి: ఆప్ 34-38, కాంగ్రెస్ 58-61, ఎస్ఏడీ 18-21, ఇతరులు 3-7

-ఉత్తరాఖండ్ సీట్లు 70
టైమ్స్ నౌ: బీజేపీకి 37, కాంగ్రెస్ 31, ఇతరులు ఒక్క స్తానంలో విజయం
-ఈటీజీ రీసెర్చ్ : బీజేపీకి 38, కాంగ్రెస్ 30, ఇతరులు 1
-మ్యాట్రిజ్ : బీజేపీకి 31, కాంగ్రెస్ 35, ఇతరులు 2

-గోవా 40 సీట్లు

-జన్ కీ బాత్ ఇండియా: బీజేపీకి 13-19, కాంగ్రెస్ 10-14, తృణమూల్ 7-8, ఆప్ 5