Begin typing your search above and press return to search.
గోవాలో హంగ్.. బీజేపీకే మణిపూర్.. ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఇదే
By: Tupaki Desk | 7 March 2022 2:49 PM GMTఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ క్రమంలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు. ముఖ్యంగా బీజేపీ నేతలు పెట్టుకున్న ఆశలను ఇక్కడ ప్రజలు ఆశీర్వదించారు. మొత్తం 60 స్థానాలున్న మణిపూర్‌లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లభించే అవకాశం కనిపిస్తోంది.
అదేవిధంగా తీర ప్రాంత పర్యాటక రాష్ట్రం గోవాలో మాత్రం మరోసారి ప్రధాన పార్టీలకు దోబూచులు తప్పడం లేదు. ఏ పార్టీకి ఇక్కడి ప్రజలు మెజారిటీ కట్టబెట్టలేదు. దీంతో ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
మినీ సార్వత్రిక సమరంగా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. అంతకుముందే.. ఫలితాల ధోరణిని అంచనా వేస్తూ విశ్లేషిస్తూ ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఎవరిదోనని చెప్పేస్తాయి. సర్వేల ద్వారా ఓటర్ల నాడిని పసిగడతాయి. తాజాగా ఈ ఫలితాలు వెలువడ్డాయి.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ విషయానికి వస్తే.. అన్ని ఎగ్జిట్‌పోల్ సర్వేలు.. కూడా ఇక్కడ బీజేపీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందని.. హంగ్ ఏర్పడే అవకాశం లేదని తేల్చి చెప్పాయి. అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి తక్కువగానే ఉందని ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది.
మరోవైపు.. గోవాలో మాత్రం హంగ్ ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో ప్రయత్నించింది. అదేసమయంలో ఆప్ ఎన్నికల్లో కీలకంగా మారింది. అయినప్పటికీ.. ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపలేదు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వేలో.. గోవా ప్రజలు మరోసారి.. గతంలో ఇచ్చిన చిత్రమైన తీర్పునే ఇవ్వడం గమనార్హం.
ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఇదీ..
గోవా మొత్తం స్థానాలు 40
సీఎన్ఎక్స్ అంచనాలు
బీజేపీ 11-16 కాంగ్రెస్ 11-17 ఆప్ 0-02 ఇతరులు 05-07
జన్‌కీ బాత్ ఇండియా
బీజేపీ 13-19 కాంగ్రెస్ 14-19 ఆప్ 01-02 ఇతరులు 04-08
------------------------------
మణిపుర్లో మొత్తం స్థానాలు- 60
జన్‌కీ బాత్ ఇండియా
బీజేపీ 23-28 కాంగ్రెస్ 10-14 ఎన్‌పీపీ 07-08 ఎన్‌పీఎఫ్ 05-07 జేడీయూ 05-07 ఇతరులు 02-03