Begin typing your search above and press return to search.
ఎగ్జిట్ పోల్స్: హుజూర్ నగర్ వీరిదే..
By: Tupaki Desk | 21 Oct 2019 4:23 PM GMTహుజూర్ నగర్ లో సోమవారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. కొన్ని పోలింగ్ బూత్ లలో క్యూలో ఉన్న వారిని ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. ఓవరాల్ గా హుజూర్ నగర్ పోలింగ్ ముగిసినట్టే.. ఇక ఫలితమే తరువాయి..
హుజూర్ నగర్ ను దక్కించుకునేందుకు అధికార టీఆర్ ఎస్ - సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీ తలపడ్డాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో టీఆర్ ఎస్ డిఫెన్స్ లో పడింది. బీజేపీ - టీడీపీలో ఉధృతంగానే పోరాడాయి. మరి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ ఊపేస్తోంది.
తాజాగా హుజూర్ నగర్ ఫలితంపై రీసెర్చ్ అండ్ అనాలసిస్ బై పబ్లిక్ పల్స్ సంస్థ పోలింగ్ వేళ ఓటర్ల అభిప్రాయాన్ని తీసుకుంది. ఈ సందర్భంగా గెలుపుపై ఓ అంచనాకు వచ్చేసింది. హుజూర్ నగర్ లో అధికార టీఆర్ ఎస్ దే గెలుపు అని తేల్చింది. అయితే హోరా హోరీ పోరు ఖాయమని తేల్చింది.
సర్వేలో టీఆర్ ఎస్ కు ఓటు వేశామని దాదాపు 48.4శాతం మంది చెప్పడం గమనార్హం. ఇక కాంగ్రెస్ కు ఓటేశామని 42.9శాతం మంది - టీడీపీకి 4.8శాతం మంది - బీజేపీకి 3.1శాతం మంది - ఇతరులకు 0.8శాతం మంది ఓట్లు వేయడం గమనార్హం. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో టీఆర్ ఎస్ కు ప్రత్యామ్మాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీకి అస్సలు తెలంగాణలో ఉనికేలేని టీడీపీ కంటే కూడా తక్కువ ఓటు శాతం రావడం కమళదళానికి షాకిచ్చే పరిణామంలా కనిపిస్తోంది.
+ టీఆర్ ఎస్ గెలుపునకు దోహదపడ్డ అంశాలివీ..
* రాష్ట్రంలో టీఆర్ ఎస్ అధికారంలో ఉండడంతో అభివృద్ధి కోణంలోనే ఓటర్లు కారు గుర్తుకు ఓటేశారని సర్వేలో చెప్పారు.
* టీఆర్ ఎస్ అభ్యర్థి గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ సానుభూతి పనిచేసింది
*హుజూర్ నగర్ లో రైతులు ఎక్కువగా ఉండడం.. వారికి 24 గంటల ఉచిత కరెంట్ - రైతుబంధు పథకం డబ్బులు రావడం టీఆర్ ఎస్ కు ఓట్ల వాన కురిపించింది.
*పెన్షన్ తీసుకునే వారంతా గంపగుత్తగా టీఆర్ఎస్ కే ఓటేయడం..
*2018లో ఈ నియోజకవర్గంలో టీడీపీ - కాంగ్రెస్ కలిసి పోటీచేశాయి. అప్పుడు 70శాతం టీడీపీ అభిమానులు కాంగ్రెస్ కు ఓటేశారు. ఈసారి టీడీపీ ఒంటరిగా పోటీచేయడంతో టీడీపీ అభిమానులు టీడీపీకే ఓటు వేయగా.. చాలా మంద్రి క్రాస్ ఓటింగ్ కు పాల్పడడం టీఆర్ ఎస్ కు కలిసి వచ్చింది.
*బీజేపీ - తీన్మార్ మల్లన్న మరియు ఇతర స్వతంత్ర్య అభ్యర్థులు ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు దక్కకుండా చీల్చడం గులాబీపార్టీకి వరంగా మారింది.
+టీఆర్ ఎస్ కు మైనస్ గా మారిన అంశాలు
-ఆర్టీసీ సమ్మె ప్రభావం చాలా ఎక్కువగా పడింది
-ఆర్టీసీ సమ్మెతో ఇతర ఉద్యోగులు టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ఓటేశారు
-ఉత్తమ్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో మంచిపేరు ఉండడం
-ఉత్తమ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం
-ప్రజల్లో ప్రభుత్వం మీద పెరిగిన వ్యతిరేకత
ఇలా మైనస్ ల కంటే ప్లస్సులే ఎక్కువగా ఉండడంతో గులాబీ పార్టీ హుజూర్ నగర్ బైపోల్ లో విజయఢంకా మోగించడం ఖాయమని రీసెర్చ్ అండ్ అనాలసిస్ బై పబ్లిక్ పల్స్ తేల్చింది. మరి ఇదే ఫలితం హుజూర్ నగర్ లో వాస్తవం అవుతుందా లేదా అన్నది తెలియాలంటే ఫలితం వచ్చే ఈనెల 24వ తేదీ వరకు ఆగాల్సిందే.