Begin typing your search above and press return to search.
ఎగ్జిట్ పోల్స్..జనసేన జీరో టు ఫైవ్..!
By: Tupaki Desk | 20 May 2019 4:37 AM GMTపవన్ కల్యాణ్ పార్టీకి ఊహించనటువంటి పరాభవం తప్పదని అంటున్నాయి వివిధ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్. ఏపీలో అసెంబ్లీ - లోక్ సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వెల్లడి అయిన ఎగ్జిట్ పోల్స్ లో జనసేనకు దక్కేది సున్నా నుంచి ఐదు సీట్లు మాత్రమే అని స్పష్టంగా పేర్కొన్నాయి అధ్యయన సంస్థలు. కొన్ని అధ్యయన సంస్థలు అయితే జనసేన ఖాతా కూడా తెరవకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం చేయడం విశేషం. ఆ లెక్కన చూసుకుంటే పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల్లో గెలవలేకపోతున్నట్టే. అయితే మరి కొన్ని అధ్యయన సంస్థలు మాత్రం పవన్ కల్యాణ్ గెలుపును అంచనా వేస్తున్నాయి.
జనసేన పార్టీ ఖాతా తెరుస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆ పార్టీకి మూడు ఎమ్మెల్యే స్థానాలు దక్కే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెప్పాయి. ఒకటీ రెండు ఎగ్జిట్ పోల్స్ మాత్రం జనసేనకు ఐదు ఎమ్మెల్యే సీట్ల వరకూ దక్కే అవకాశం ఉందని పేర్కొనడం విశేషం.
జనసేన విషయంలో జనాల అంచనాలు మొదటి నుంచి ఇదే స్థాయిలో ఉన్నాయి. పవన్ కల్యాణ్ వీరాభిమానులను మినహాయిస్తే మిగతా వారెవరూ జనసేన ఏదో విజయం సాధిస్తుందని అనుకోలేదు. అయితే పోలింగ్ సమయానికి జనసేనకూ కొంత మీడియా శక్తి వచ్చింది. పవన్ భజన చేసే చానళ్లు తయారయ్యాయి. దీంతో జనసేన గొప్ప విజయం సాధించేస్తుందని హంగామా మొదలైంది.
పోలింగ్ పూర్తి అయిన తర్వాత కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు కూడా జనసేన పెద్దగా ప్రభావం చూపలేదని విశ్లేషించాయి. గాజువాకలో పవన్ కల్యాణ్ విజయం కూడా కష్టమే అని ఆ మీడియా వర్గాలు విశ్లేషించాయి. అందుకు తగ్గట్టుగానే వెల్లడి అయ్యాయి ఎగ్జిట్ పోల్స్. హంగ్ పరిస్థితి - జనసేన నిర్ణయాత్మక శక్తి - కుమారస్వామిలా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయిపోవడం.. ఈ ఊహాగానాల్లో వేటికీ ఆస్కారమే లేదని - జనసేన ఖాతా తెరిస్తే అదే గొప్ప అని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. ఈ వారంలోనే అసలు ఫలితాలు వెల్లడి కావడంతో..మొత్తం కథపై పూర్తి స్పష్టత రానుంది.