Begin typing your search above and press return to search.

తుపాకీ జోస్యం; వరంగల్ విజేత.. టీఆర్ ఎస్సే

By:  Tupaki Desk   |   24 Nov 2015 4:06 AM GMT
తుపాకీ జోస్యం; వరంగల్ విజేత.. టీఆర్ ఎస్సే
X
వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించిన తుది ఫలితం మరికొద్ది గంటల్లో వెలువడనుంది. మరి.. విజేతగా ఎవరు నిలవనున్నారన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. వార్ వన్ సైడ్ అని అనుకున్నా.. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం మాత్రం నువ్వా.. నేనా అన్న రీతిలో సాగింది. ప్రభుత్వ వ్యతిరేకత ఒక మోస్తరుగా ఉండటంతో పాటు.. ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా అధికారపక్ష నేతల్ని ప్రజలు నిలదీయటం తెలిసేందే. ఈ పరిణామం అధికారపక్షానికి ఆశనిపాతంగా మారితే.. ప్రతిపక్షాలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

ప్రచార సందర్భంగా ప్రజలు నిలదీసినప్పటికీ.. ఓటరు తీర్పు మాత్రం అధికారపక్షానికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ అభ్యర్థి విజయం పక్కా అనే చెబుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థికి వచ్చినంత స్థాయిలో మెజార్టీ రాకపోవచ్చు కానీ.. విజయం ఖాయమనే చెప్పాలి. 2014తో పోలిస్తే పోలింగ్ తగ్గిన నేపథ్యంలో ఆ ప్రభావం తుది ఫలితం మీద ఉంటుందని చెప్పొచ్చు. పోలింగ్ తగ్గిన నేపథ్యంలో మెజార్టీ విషయంలో తెలంగాణ అధికారపక్షానికి కాస్తంత నిరాశ కలిగే అవకాశముంది.

అయితే.. తగ్గిన పోలింగ్ కారణంగా.. మెజార్టీ మీద ప్రభావం చూపిస్తుందన్న విషయం అందరికి తెలిసిందే కాబట్టి.. గులాబీ దళానికి విజయం సంపూర్ణంగా చెప్పొచ్చు. ఒక అంచనా ప్రకారం.. టీఆర్ ఎస్ అభ్యర్థికి 2.5లక్షల మెజార్టీ ఖాయమని చెప్పొచ్చు. ఒకవేళ టీఆర్ ఎస్ గాలి బాగా వీస్తే.. ఇది కాస్త 3 లక్షల వరకూ వెళ్లినా ఆశ్చర్యం లేదన్నట్లుగా కనిపిస్తోంది. ఓటింగ్ జరిగిన తీరును చూస్తే.. టీఆర్ఎస్ అభ్యర్థి విజయంపై ఎలాంటి సందేహాల్లేనట్లే. మెజార్టీ విషయంలోనే సందిగ్థత అంతా. మొత్తంగా చూస్తే.. మెజార్టీ 2.5లక్షల నుంచి 3 లక్షల మధ్య ఖాయమని చెప్పొచ్చు.