Begin typing your search above and press return to search.

అచ్చుగుద్దిన‌ట్లుగా.. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్లే!

By:  Tupaki Desk   |   23 May 2019 4:10 AM GMT
అచ్చుగుద్దిన‌ట్లుగా.. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్లే!
X
ఎగ్జిట్ పోల్స్ మీద అనుమానాలు ప‌టాపంచ‌లు కావాల్సిందే. ఏడో విడ‌త పోలింగ్ పూర్తి అయిన కాసేప‌టికే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మీడియాసంస్థ‌లు.. స‌ర్వే సంస్థ‌లు త‌మ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల్ని వెల్ల‌డించారు. ఎగ్జిట్ పోల్స్ లో స్ప‌ష్టంగా మోడీకే మ‌రోసారి దేశ ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా పేర్కొంటూ ఫ‌లితాల్ని వెల్ల‌డించారు.

ఈ ఫ‌లితాల‌పై విప‌క్షాలు పెద్ద ఎత్తున అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని త‌ప్ప‌ని.. వాటిని న‌మ్మాల్సిన అవ‌స‌రం లేద‌న్న విష‌యాన్ని వారు చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇదిలా ఉంటే.. ఓట్ల లెక్కింపు మొద‌లై.. ఫ‌లితాలు ఒక్కొక్క‌టిగా వెలువడుతున్న వేళ.. విడుద‌ల‌వుతున్న అధిక్య‌త‌ల్ని చూస్తే.. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్లే మోడీ ప‌రివారానికి పెద్ద ఎత్తున మెజార్టీ ల‌భించ‌నుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

వివిధ రాష్ట్రాల్లో అధిక్య‌త‌ల ట్రెండ్ చూస్తుంటే.. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన దాని కంటే ఎక్కువ సీట్లు ఎన్డీయే కూట‌మి సాధించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధిక్య‌త ప్ర‌ద‌ర్శించిన రాష్ట్రాల్లోనూ మోడీ హ‌వా న‌డుస్తుండ‌టం.. ఎన్డీయే కూట‌మికి భారీ ఎత్తున అధిక్య‌త‌లో క‌నిపిస్తున్న తీరు చూస్తే.. ఈసారి ఎగ్జిట్ పోల్స్ అక్ష‌ర స‌త్య‌మ‌న్న‌ట్లుగా.. ఓట‌ర్ల నాడిని ప్ర‌తిబింబించేలా ఉన్నాయ‌న్న మాట చెప్ప‌క త‌ప్ప‌దు.