Begin typing your search above and press return to search.
షర్మిలమ్మే సీఎం : ఇంతకీ డీఎస్ ఏ పార్టీలో ఉన్నారు...?
By: Tupaki Desk | 25 July 2022 5:30 PM GMTఆయన తలపండిన రాజకీయ నాయకుడు. ఇంకా చెప్పాలీ అంటే ముఖ్యమంత్రి పదవి తృటిలో తప్పిపోయిన నాయకుడు. తెలంగాణాలో ఆయన స్పేస్ ఫోకస్ ఏంటన్నవి ఎవరికీ అర్ధం కావు. ఒక విధంగా ఆయనకు కూడా అర్ధం కావు. ఆయనే డీఎస్. అనబడే ధర్మపురి స్రీనివాస్. ఆయన 1989లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పదేళ్ళు తిరగకుండానే కాంగ్రెస్ అగ్ర నాయకులలో ఒకరిగా మారిపోయారు. ఇక వైఎస్ డీఎస్ జంట 2004 టైమ్ లో ఎంతటి ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే.
ఇద్దరూ కాంగ్రెస్ ని సక్సెస్ ఫుల్ గా నడిపించారు. విభజన తరువాత డీఎస్ కాంగ్రెస్ కి దూరం జరిగారు. ఆయన అధికార టీయారెస్ లో చేరితే రాజ్యసభ మెంబర్ షిప్ దక్కింది. ఆ పదవి కూడా ఈ మధ్యనే ముగిసింది. ఇక టీయారెస్ లో ఆయన టెక్నికల్ గా ఈ రోజుకీ మెంబరే. కానీ ఆయనకు అక్కడ అంత సీన్ లేదని అంటారు. కేసీయార్ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన కుమారుడు బీజేపీలో ఉన్నారు.
ఆయన మాత్రం కాంగ్రెస్ లోకి వెళ్ళాలని కొన్నాళ్ళ క్రితం ప్రయత్నం చేశారు. ఎందుకో అది కుదిరినట్లుగా లేదు. ఇపుడు ఆయనకు వయోభారం కూడా ఉంది. ఇదిలా ఉంటే ఆయన లేటెస్ట్ గా ఒక బోల్డ్ స్టేట్మెంట్ వదిలారు. అదేంటి అంటే షర్మిలమ్మ తెలంగాణకు సీఎం కావాలని, ఆమె అవుతుందని. తాను అన్న మాటలు జరిగితీరుతాయని కూడా చెప్పుకున్నారు. 2004 టైమ్ లో వైఎస్సార్ సీఎం అవుతారు అని ఆయనే చెప్పారట.
ఇక దీనికి ముందు ఒకటి జరిగింది. షర్మిల తన తండ్రి వైఎస్సార్ కి దోస్త్ అన్న ఉద్దేశ్యంతో డీఎస్ కి ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఆ మీదట స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య రాజకీయాలే చర్చకు వచ్చి ఉంటాయనే అంటున్నారు. తెలంగాణాలో పార్టీ పెట్టి ఏడాది పై దాటినా చెప్పుకోదగిన నాయకుడు అయితే షర్మిల పార్టీలో చేరలేదు.
దాంతో ఆమె తన తండ్రి సహచరులను వరసగా కలవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ క్రమంలో డీఎస్ ని కూడా కలసి ఆయనతో మంతనాలు సాగించారు అని అంటున్నారు. ఇక టీయారెస్ లో ఉన్నట్లా లేనట్లా అన్నట్లుగా ఉన్న డీఎస్ షర్మిలమ్మ పార్టీలో చేరుతారా అన్నది ఒక చర్చ. ఆయన కనుక చేరితే కచ్చితంగా వైఎస్సార్టీపీకి ఎంతో కొంత బలం చేకూరినట్లే. డీఎస్ పెద్ద నాయకుడు. పైగా బీసీ నేతగా బలమైన గొంతుక కలిగిన వారు మరి ఆయన షర్మిల పార్టీలో చేరడానికేనా ఆమె ఫ్యూచర్ సీఎం అని జోస్యం చెప్పినది అన్న మాట కూడా ఉంది.
ఏది ఏమైనా షర్మిల పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అన్నది ఒక అంచనాకు అందని అతి పెద్ద సందేహం. అయితే బడా నాయకులు కొందరు చేరితే మాత్రం కచ్చితంగా తాను గెలవకపోయినా కాంగ్రెస్ ని చీల్చే స్థాయిలో మాత్రం ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ పరిణామాలు అన్నీ షర్మిల సీఎం పదవి కోసం కాకుండా కేసీయార్ ని మూడవసారి గెలిపించడానికే పనికివచ్చినా వస్తాయని అనే వారూ ఉన్నారు. మొత్తానికి డీఎస్ తాపీగా ఒక రాజకీయ జోస్యం వదిలారు. ఫ్యూచర్ లో చూసుకోండి షర్మిల సీఎం అంటున్నారు. మరి ఇది చెప్పిన ఆయన తాను ఏ పార్టీయో మాత్రం చెప్పలేదు. అదే కదా రాజకీయ గడుసుదనం అంటే.