Begin typing your search above and press return to search.
వామ్మో.. ఈ అంచనాలేందిరా బాబు..!
By: Tupaki Desk | 11 Jun 2015 6:13 AM GMTఅదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్నట్లుగా మారిపోయాయి రాజకీయ వార్తలు. మిగిలిన మీడియా సంగతేమో కానీ.. నెట్ ప్రపంచంలో వస్తున్న వార్తలు కొన్ని చూస్తే మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావటం ఖాయం. చెప్పే మాటకు.. చేసే వ్యాఖ్యకు ఒక అర్థం.. పర్థం లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడేయటం.. అడ్డంగా రాసేయటం ఈ మధ్య కాలంలో ఎక్కువైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఓటుకు నోటు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త చిచ్చు రేపటమే కాదు..రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య భారీ లడాయినే తీసుకురావటం తెలిసిందే. వ్యక్తిగత విమర్శలతో వాతావరణ వేడెక్కించేస్తున్న వారి వైఖరి ఒకపక్క సంచలనం సృష్టిస్తుంటే.. మరోపక్క అర్థం పర్థం లేని అంచనాలతో నెట్ ప్రపంచంలో వస్తున్న వార్తలు గాలివార్తలుగా మారుతున్నాయి.
ఓటుకు నోటు కేసులో కొత్త మలుపు చోటు చేసుకోనుందని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ అధికారులు నోటీసులు జారీ చేస్తారని.. ఈ నేపథ్యంలో బాబు రాజీనామా చేస్తారన్న వార్తల జోరు పెరిగింది. ఇక్కడికే ఇదో పెద్ద జోక్ అనుకుంటే.. దీన్ని కంటిన్యూ చేస్తూ బాబు తన రాజీనామా తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం ఇస్తారన్న అంశంపై చర్చ మొదలైంది.
కొన్నింట్లో బాలయ్యబాబుకు అని రాస్తే.. మరికొన్నింట్లో లోకేశ్‌బాబు అని రాసేస్తున్నారు. వీరిద్దరితో పాటు ఏ మాత్రం సంబంధం లేని పవన్‌కల్యాణ్‌ను కూడా తెర మీదకు తీసుకొచ్చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్‌కల్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పేస్తే.. రాజకీయ సీన్ అదిరిపోతుందన్న వార్తలు వండేశారు.
అయినా.. ఒక వివాదానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయటం అంత తేలికైన పరిణామం కాదన్న విషయం మర్చిపోకూడదు. ఒకవేళ అలా జరగాలంటే చాలానే తతంగం ఉంటుందని మర్చిపోకూడదు. ఒక రాష్ట్రంలో అధికార బదిలీ.. అందునా చంద్రబాబులాంటి వ్యక్తి తన సీఎం పదవికి రాజీనామా చేయటం అంత సింఫుల్‌గా జరిగిపోయేది కాదు. రాజకీయ అంచనాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.
రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కానీ.. ఒకమాట.. ఒక అంచనా చెప్పే ముందు కాస్తంత ముందు..వెనుకలు ఆలోచించాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. లేదంటే గాలి వార్తలకు.. వీటికి పెద్ద వ్యత్యాసం ఏముంటుంది?