Begin typing your search above and press return to search.

గోరంట్ల వీడియోపై నిపుణుడి క్లారిటీ!

By:  Tupaki Desk   |   13 Aug 2022 12:11 PM IST
గోరంట్ల వీడియోపై నిపుణుడి క్లారిటీ!
X
గత వారం పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద చర్చనీయాంశం.. అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారమే. ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ ఆయన నగ్న ప్రదర్శన చేసినట్లుగా ఉన్న వీడియో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. అది వీడియో కాల్ నడుస్తున్న మొబైల్ స్క్రీన్‌ను మరో ఫోన్‌తో వీడియో తీయగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఐతే గోరంట్ల మాధవ్ ఆ వీడియో తనది కాదని, తాను జిమ్ చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోలను ఎవరో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. ముందు ఈ వీడియో వైరల్ అయినపుడు వైకాపా అగ్రనేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి అది నిజమని తేలితే చర్యలు తప్పవన్నారు. తర్వాతేమో అది పర్సనల్ వ్యవహారం అని, పైగా ఫేక్ వీడియో అంటున్నారని వ్యవహారాన్ని తేలిక పరిచే ప్రయత్నం చేశారు.

ఈ విషయమై విచారణ జరిపిన అనంతపురం ఎస్పీ ఏమో.. ఆ వీడియో ఒరిజినల్ అని చెప్పలేమని, వీడియో చాలాసార్లు ఫార్వర్డ్ అయినందున ఒరిజినల్ వీడియో ఏదన్న దానిపై క్లారిటీ లేదని, పైగా ఈ విషయమై బాధితులు ఎవరూ ఎవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి తాము చేసేదేమీ లేదని తేల్చేశారు.

ఈ మేరకు ఎస్పీ క్లారిటీ ఇచ్చేసరికి గోరంట్ల మాధవ్ మీడియా సమావేశం పెటట్ రెచ్చిపోయారు. తనకా వీడియోతో సంబంధమే లేదన్నట్లు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ తదితరులను బూతులు తిట్టాడు.

ఐతే సదరు వీడియోలో ఉన్నది మాధవా కాదా అనే విషయమై సైబర్ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సైబర్ నేరాల విషయమై పోలీసులతో పాటు ఫోరెన్సిక్ వాళ్లకు కూడా శిక్షణ ఇచ్చే స్థాయి ఆయనది.

గోరంట్ల వీడియోపై ఆయన మాట్లాడుతూ.. ''ఫొటోలను ఎడిట్ చేసినంత సులువుగా వీడియోలను ఎడిట్ చేయడం సాధ్యం కాదు. గోరంట్ల మాధవ్‌కు సంబంధించి పర్టికుల్ వీడియోను పరిశీలిస్తే అది మార్ఫ్‌డ్ అయి ఉండే అవకాశం లేదనిపిస్తోంది. ఎందుకంటే వీడియోల్లో సాధారణంగా ముఖాల వరకే మార్చగలం. శరీరంలోని మిగతా భాగాలను మార్చడం దాదాపు సాధ్యం కాదు. ఈ వీడియోలో తలకు, బాడీకి సింక్ కనిపిస్తోంది. కాబట్టి అది మార్ఫ్‌డ్ అయ్యుండే అవకాశాలు తక్కువ'' అని శ్రీధర్ స్పష్టం చేశారు.