Begin typing your search above and press return to search.
పేలిన మొబైల్ .. ఇంటర్ విద్యార్థి దుర్మరణం , తట్టుకోలేక తండ్రి కూడా !
By: Tupaki Desk | 1 Jan 2021 10:20 AM GMTస్మార్ట్ ఫోన్ .. ప్రస్తుతం చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వారిని వెళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ప్రస్తుత ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్ పై నే ఆధారపడి ఉంది. అయితే , మొబైల్ ఛార్జింగ్ పెట్టి వాడకండి అని ఎంతో మంది నిపుణులు చెప్తున్నా , ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఫోన్స్ పేలిపోతున్నా కూడా ఆ పని మాత్రం మానడంలేదు. ఛార్జింగ్ పెట్టి మాట్లాడటం చేస్తూనే ఉన్నారు. దీనితో చార్జింగ్ పెట్టిన సమయంలో సెల్ ఫోన్లు పేలుతున్న ఘటనలు ఇటీవల అధికమయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. సెల్ ఫోన్ ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. కొడుకు మృతి తట్టుకోలేక అతడి తండ్రి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... కరూర్ జిల్లా చిన్నతారాపురానికి చెందిన బాలాజీ ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం బాలాజీ తన సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టాడు. దీంతో ఫోన్ బాగా వేడెక్కి పెద్ద శబ్ధంతో బాంబు మాదిరిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలాజీ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అప్పడిదాగా ఆడుతూ పాడుతూ కనిపించిన కుమారుడు విగతజీవిగా పడిపోవడంతో తట్టుకోలేని తండ్రి చెల్లముత్తు గుండెపోటుకు గురై చనిపోయాడు. ఒకే ఇంట్లో ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆ ప్రాంతంలో విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.