Begin typing your search above and press return to search.
2 కోట్లు అప్పుపడ్డ స్పీకర్
By: Tupaki Desk | 18 July 2016 11:48 AM GMTసమాజంలో కీలక స్థానంలో ఉన్నవారు పదిమందికి ఆదర్శంగా ఉండాలి. కానీ వారే తప్పటడుగులు వేస్తే..సమాజం ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది. ఇపుడు అదే జరుగుతోంది. యూపీఏ పాలన సాగిన రోజుల్లో స్పీకర్ గా పని చేసిన మీరా కుమార్ దాదాపు రూ. 2 కోట్ల వరకూ కేంద్రానికి చెల్లించాల్సిన అద్దె బకాయిలను ఎగ్గొట్టారనే విషయంలో వెలుగులోకి వచ్చి షాకింగ్ లాగా మారింది.
మాజీ ఉప ప్రధానిగా ఉన్న జగ్జీవన్ రామ్ బతికి ఉన్న సమయంలో ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గంలో ఆయనకు ఓ బంగళాను కేటాయించారు. ఆయన మృతి తరువాత జగ్జీవన్ రామ్ సతీమణి ఇంద్రాణి అక్కడ ఉన్నారు. ఆమె మరణానంతరం వారి కుమార్తె మీరా కుమార్ అదే బంగళాను వాడుతున్నారు. దీని జోలికి ప్రభుత్వం రాకుండా చూసేందుకు, జగ్జీవన్ రామ్ స్మారక భవనంగా మార్చారని, అందుకు ప్రభుత్వ అనుమతి ఏమీ లేదని తెలుస్తోంది. ఈ విషయం సుభాగ్ చంద్ర అనే సహ చట్టం కార్యకర్త ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా వెలుగులోకి తెచ్చారు. భవంతికి సంబంధించి రూ. 1.98 కోట్ల అద్దెను మీరా కుమార్ బకాయి పడినట్లు రికార్డులు వెల్లడించాయి. అద్దెను రద్దు చేయాలని కూడా ఆమె ఎటువంటి దరఖాస్తులూ చేయలేదని తెలుస్తోంది.