Begin typing your search above and press return to search.

వివాహేతర సంబంధం: భర్తను అడ్డు తొలగించుకోవాలని

By:  Tupaki Desk   |   13 March 2021 12:30 AM GMT
వివాహేతర సంబంధం: భర్తను అడ్డు తొలగించుకోవాలని
X
ఢిల్లీలో ఓ వ్యక్తిపై కాల్పుల ఘటనను పోలీసులు ఛేదించారు. ఇందులో పోలీసులనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం సాగిందని తేలడం విశేషం. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని తేల్చారు.భీమ్ రాజ్ (45) అనే వ్యక్తి చిరాగ్ ఢిల్లీలో భార్య భాటియా (41)తో కలిసి నివసిస్తున్నాడు. భీమ్ రాజ్ బీఎస్ఈఎస్ లో పవర్ కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి భార్య భాటియాకు 23 ఏళ్ల రోహన్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి విషయం తెలుసుకున్న భీమ్ రాజ్ పలు మార్లు భార్యను మందలించాడు. అయినా ఆమె మారలేదు. ప్రియుడు రోహన్ తో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది.

ఈ క్రమంలోనే రోహన్ ఓ దేశీయ తుపాకీ కొని బైక్ నంబర్ ను మార్చి భీమ్ రాజ్ కారులో వెళ్తుండగా బైక్ పై వెంబడించి భీమ్ రాజ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భీమ్ రాజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ కాల్పులు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. సీసీకెమెరా ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. నంబర్ ప్లేటు మార్చడంతో బైక్ ఎవరిదో తెలుసుకున్నారు. చివరికి సాంకేతిక ఆధారాలతో నిందితుడు రోహన్ ను బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.

రోహన్ ను విచారించగా తనకు , భీమ్ రాజ్ భార్యకు వివాహేతర సంబంధం ఉందని.. ఆమె తన భర్త అడ్డు తొలగించాలని కోరడంతో ఈ దారుణానికి పాల్పడ్డట్టు స్పష్టం చేశాడు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. భీమ్ రాజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.