Begin typing your search above and press return to search.
వివాహేతర సంబంధం నేరం కాదా?
By: Tupaki Desk | 12 April 2022 2:30 AM GMTవివాహేతర సంబంధం పెట్టుకుంటే అది నేరమా? శిక్ష పడుతుందా? అంటే ఇన్నాళ్లు పడేది.. కానీ సుప్రీంకోర్టు దీన్ని సమీక్షించింది. భార్య కాకుండా ఇతర మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషుడిని శిక్షించే చట్టాన్ని తాజాగా సుప్రీంకోర్టు పున: పరిశీలించింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల పుఱుషుడిని మాత్రమే శిక్షించే వ్యభిచార నేర చట్టం మారాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించింది. ఎందుకంటే వివాహేతర సంబంధంలో స్త్రీ పురుషులిద్దరికీ సమానమైన పాత్ర ఉంటుంది.
1860 బ్రిటీష్ కాలం నాటి భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 497 ప్రకారం.. ఒక మహిళతో వివాహిత అని తెలిసి వివాహేతర శారీరక సంబంధం పెట్టుకుంటే నేరంగా పరిగణిస్తారు. ఆమె భర్త అనుమతి లేకుండా శృంగారం చేస్తే తప్పుగా భావిస్తారు. వివాహేతర సంబంధానికి ఆమోదం లేకుంటే అది నేరంగా చెబుతారు. ఇది రుజువైన పక్షంలో 5 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు.
ఆ పురుషుడు వివాహితుడైనప్పటికీ ఆ మహిళ ఒంటరి కానీ.. వితంతువు కానీ అయితే ఆ పురుషుడిని దోషిగా పరిగణించరాదని గుర్తించాలి. వివాహేతర సంబంధానికి అంగీకారం తెలుపడంలో ఆ సంబంధంలో భాగస్వామిగా ఉండడంతో మహిళలూ సమాన పాత్ర పోషిస్తారు. ఈ నిర్ణయం వారి తరుఫున ఆ పురుషుడు తీసుకున్నది కాదు.. అందుకు వారికి భర్త అనుమతి అవసరం లేదు.
ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు సమీక్షించింది. ఒకటి మహిళను కూడా శిక్షార్హురాలిని చేస్తూ చట్టాన్ని సవరించడం.. లేదా వివాహేతర సంబంధాలను నాన్ క్రిమినల్ నేరంగా పరిగణించడం.. పై సుప్రీంకోర్టు సమీక్షించింది.
ఈ క్రమంలోనే గత సంవత్సరమే సుప్రీంకోర్టు కూడా వివాహేతరసంబంధం నేరం కాదని తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా భారత చట్టంలోని సెక్షన్ 497ను కూడా తొలగించింది. ఒక వయోజన వయసు వచ్చిన మగాడు కూడా తనకు కావాల్సిన ఆడవారితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాడని తెలిపింది.