Begin typing your search above and press return to search.
జంపింగ్ జపాంగ్ః కొడుకు భార్యతో తండ్రి.. అల్లుడితో అత్త..!
By: Tupaki Desk | 5 July 2021 1:19 PM GMTరానురానూ వివాహేతర సంబంధాలు మరీ దారుణంగా తయారవుతున్నాయి. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగనంత జుగుప్సాకరంగా మారిపోతున్నాయి. ఉత్తర ప్రదేశ్లో వెలుగు చూసిన రెండు ఉదంతాలు వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఓ ఘటనలో.. అత్త-అల్లుడు, మరో ఘటనలో కోడలు-మామ. వరుసగా వెలుగు చూసిన వ్యవహారాలు.. తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
మొదటి ఘటనలో.. కామంతో కళ్లు మూసుకుపోయిన అత్త, అల్లుడు చాటుమాటుగా ఇంట్లోనే వ్యవహారం నడిపించారు. చివరకు ఈ విషయం బయటపడడంతో.. బరితెగించి ఒక్కటయ్యారు. అంతేకాదు.. తామిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని సంచలన ప్రకటన చేశారు. కూతురి భవిష్యత్ గురించి ఈమె ఆలోచించలేదు.. భార్య, కుటుంబం గురించి ఇతగాడు పట్టించుకోలేదు. దీనికి కుటుంబ సభ్యులతోపాటు ఊరిజనం కూడా అభ్యంతరం తెలపడంతో.. వీళ్లంతా కలిసి ఎక్కడ తమను విడదీస్తారోనని సమయం చూసుకొని ఊరు వదిలి జంపయ్యారు.
రెండో ఘటన కూడా ఉత్తరప్రదేశ్ లోని బడౌన్ జిల్లాలో వెలుగు చూసింది. 2016లో ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం కాపురం చేసిన తర్వాత వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. భర్త మద్యానికి బానిస అయ్యాడంటూ అతన్ని వదిలేసింది భార్య. అయితే.. వీరిద్దరూ విడిపోయిన కొన్నాళ్లకు అబ్బాయి తండ్రి కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వేరే ప్రాంతంలో పనిచేసుకుంటున్నానని, అక్కడే ఉంటానని ఇంట్లో చెప్పాడు.
అయితే.. కొడుకుకు ఈ విషయంలో అనుమానం వచ్చింది. తన తండ్రి అక్కడ ఏదో చేస్తున్నాడని సందేహించి, కూపీ లాగాడు. దీంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తండ్రి, తన మాజీ భార్య పెళ్లి చేసుకుని.. కాపురం చేస్తున్న చేదు నిజం తెలుసుకున్నాడు. ఈ పెళ్లి ద్వారా తాను సంతోషంగా ఉన్నానని సదరు మహిళ చెప్పడం విశేషం. ఈ విధంగా చూస్తే.. తాను పెళ్లి చేసుకున్న మహిళనే తనకు పిన్నిగా మారడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్నవారంతా.. ఈ సమాజం ఎటు పోతోందో అని నిట్టూర్చారు.