Begin typing your search above and press return to search.
వార్ ఎఫెక్ట్.. రష్యాలో విపరీతంగా పెంపు, జనం ఉక్కిరిబిక్కిరి
By: Tupaki Desk | 4 March 2022 11:30 AM GMTఎంతమంది వ్యతిరేకించినా రష్యా... ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తూనే ఉంది. ఆ దేశం ఎదురొడ్డి నిలుస్తున్నా కొద్దీ... రష్యన్ సైన్యం భీకరంగా యుద్దం చేస్తున్నారు. ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై బాంబుల మోత మోగిస్తున్నారు. అవసరమైతే అణ్వాయుధాల వాడకానికి సిద్ధంగా ఉండాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్... ఇటీవలె హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రష్యాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే దాదాపు అన్నిరకాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.
యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆ దేశంలో నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా దుకాణాల్లో సరుకు తగ్గిపోతోంది. వారికి తిరిగి కొనడానికి ఉత్పత్తులకు కొరత ఏర్పడింది. అందుకే పెద్దమొత్తంలో సరుకు విక్రయించడానికి వ్యాపారులు ససేమిరా అంటున్నారు. నిత్యావసరాలు, ఆహారపదార్థాల ధరలు దాదాపు 30-40 శాతం వరకు పెరిగాయి.
రష్యాలో ఆర్థిక లావాదేవీలు సైతం స్తంభించాయి. ఏటీఎంలల్లో డబ్బులు ఉండడం లేదు. పైగా ఆన్ లైన్ చెల్లింపులు సైతం నిలిచిపోయాయి. సిగ్నల్స్ సమస్యతో అవి కూడా స్తంభించాయి. మరోవైపు ఉద్యోగులకు వేతనాలు కూడా అందడం లేదు.
యుద్ధం సాకుతో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉక్రెయిన్ దురాక్రమణకు పాల్పడిన రష్యాకు ఇప్పటినుంచి తిప్పలు మొదలయ్యాయి. ఇదే మరికొన్నాళ్లపాటు కొనసాగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యుద్ధం నేపథ్యంలో కొన్నింటిపై ఆంక్షలు విధించాయి. ఈ యుద్ధాన్ని ఖండిస్తూ.. పలు సంస్థలు ఆంక్షలు విధించాయి. ఆ దేశంలో వాటి సేవలను నిలిపివేశాయి. కాగా దీనిపై రష్యా స్పందించింది. ట్విటర్, ఫేస్ బుక్ వంటి వాటిపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
ఈ సైనిక పోరు గురించి వ్యాపిస్తున్న సమాచారానికి అడ్డుకట్టవేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక రష్యా ఆర్మీపై అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తే జైలు శిక్షలు అనుభవించాల్సి వస్తుందని పేర్కొంది.