Begin typing your search above and press return to search.

డిజిట‌ల్ ప్ర‌చారానిదే రాబోయే భ‌విష్య‌త్‌

By:  Tupaki Desk   |   14 March 2017 2:52 PM GMT
డిజిట‌ల్ ప్ర‌చారానిదే రాబోయే భ‌విష్య‌త్‌
X
రాబోయే కాలంలో ప్ర‌క‌ట‌న‌ల రంగంలో ఎర్నెస్ట్ ఆండ్ యంగ్ ఆస‌క్తిక‌ర‌మైన నివేదిక ఇచ్చింది. ఇంట‌ర్నెట్ అంద‌రికీ చేరువ కావ‌డం, మొత్తం జ‌నాభాలో యువ‌త శాతం ఎక్కువ‌గా ఉండటం, వేగంగా చేరువ అవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల రాబోయే కాలంలో డిజిటల్ మార్కెట్ శరవేగంగా పుంజుకుంటుంద‌ని తేల్చి చెప్పింది. వచ్చే మూడేళ్ల‌లో రూ.20 వేల కోట్లకు చేరుకోనుందని ఈవై ఇండియా వెల్లడించింది. గడిచిన సంవత్సరంలో రూ.8,490 కోట్లుగా నమోదైన మార్కెట్‌ తో పోలిస్తే 2021-22 నాటికి రెండింతలు కంటే అధికంగా వృద్ధిని నమోదు చేసుకోనుంద‌ని తెలిపింది.

స్మార్ట్‌ ఫోన్లు - బ్రాడ్‌ బ్యాండ్ సేవల వినిమయం పుంజుకుంటుండటంతో వచ్చే మూడేండ్లలో సంప్రదాయ మీడియాను డిజిటల్ రంగం దాటేయనుంద‌ని ఎర్నెస్ట్ ఆండ్ యంగ్ విశ్లేషించింది. దేశవ్యాప్తంగా స్మార్ట్‌ ఫోన్లను వినియోగిస్తున్న వారిలో మూడోవంతు బ్రాడ్‌ బ్యాండ్ సేవల పరిధిలోకి రావడంతో డిజిటల్ రంగం దూసుకుపోవడానికి కారణమని ఈవై ఇండియా మీడియా అండ్ ఎంటర్‌ టైన్‌ మెంట్ సలహాదారు అశిష్ పేర్వానీ తెలిపారు. మార్కెట్ పరిశోధన సంస్థ ఈ-మార్కెటర్ ప్రకారం...ప్రతిరోజు భారతీయుడు సంప్రదాయ మీడియా (టీవీ, రేడియో, పేపర్లు, మ్యాగజైన్లు) కోసం రెండున్నర గంటలపాటు వెచ్చిస్తుండగా, అదే డిజిటల్ మీడియాకోసం సరాసరిగా గంటపాటు కేటాయిస్తున్నారు. అంతర్జాతీయంగా కేబుల్ కోసం నెలకు 80-90 డాలర్లు, అదే బ్రాడ్‌ బ్యాండ్ సేవల కోసం 25-30 డాలర్లు వెచ్చిస్తుండగా.. భారత్‌తో మాత్రం కేబుల్‌ కోసం రూ.250, బ్రాడ్‌ బ్యాండ్ సేవలకోసం రూ.500 నుంచి రూ.1,000 చొప్పున కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/