Begin typing your search above and press return to search.
ఈ రోజు కేసీఆర్ కు ఆపరేషన్ పక్కానట
By: Tupaki Desk | 4 Sep 2017 5:09 AM GMTఎంతో కాలంగా అప్పుడు.. ఇప్పుడూ అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతున్న కంటి శస్త్రచికిత్స ఈ రోజు జరగనుంది. గతంలో పలుమార్లు శస్త్రచికిత్స కోసం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లటం.. ఆపరేషన్ చేయించుకోకుండా తిరిగి రావటం తెలిసిందే. ఈసందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని కేసీఆర్ చెప్పినట్లుగా మీడియాలో వచ్చింది.
తనకు సూదిమందు అంటే భయమని.. ఆ కారణంతోనే తాను ఆపరేషన్ చేయించుకోకుండా వాయిదాలు వేస్తున్నట్లుగా ఆయన సరదాగా చెప్పటం వార్తల్లో వచ్చింది.
ఈ వార్త వచ్చిన తర్వాత కేసీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకు సూది మందు అంటే భయం లేదని చెప్పటం గమనార్హం. అయితే.. ఆపరేషన్ వాయిదాల మీద వాయిదాలు పడటం మీద కూడా ఆయన పెద్దగా సమాధానం చెప్పలేదనే చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆయన ఢిల్లీ టూర్ కేవలం కంటి ఆపరేషన్ కోసమని చెప్పుకొచ్చారు. కానీ.. కేంద్రమంత్రి జైట్లీని కలవటం.. బైసన్ పోలో గ్రౌండ్ భూమిని తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఇచ్చేందుకు అవసరమైన కీలక ప్రకటనను అధికారికంగా చేయించటం లాంటివి చేశారు.
శనివారం బిజీగా ఉన్న కేసీఆర్.. ఆదివారం మాత్రం అందుకు భిన్నంగా ఢిల్లీలోని తన నివాసంలో ఉండిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు (సోమవారం) చేయించుకోనున్న కంటి ఆపరేషన్ కు సంబంధించిన ముందస్తు పరీక్షల్ని తన ఇంట్లోనే చేయించుకున్నట్లుగా చెబుతున్నారు.
ఈ రోజు కేసీఆర్ కంటికి శస్త్రచికిత్స పక్కా అని.. ఇది పూర్తి అయిన తర్వాత రెండు రోజులు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.